ఆసియా బిలియనీర్ క్యాపిటల్‌గా తొలిసారి భారత ఆర్థిక రాజధాని ముంబై నిలిచింది. ముంబైలో మొత్తం 92 మంది బిలియనీర్లు మాత్రమే ఉండగా.. ఈ సంఖ్య బీజింగ్‌లో 91గా ఉంది. ఈ మేరకు తాజాగా, హురూన్ రీసెర్చ్ 2024 గ్లోబల్ రిచ్ లిస్ట్ ఈ జాబితాను రిలీజ్ చేసింది. అయితే, హురూన్ లిస్ట్ ప్రకారం.. ఓవరాల్‌గా చూసినట్లయితే చైనాలో మొత్తం 814 మంది బిలియనీర్లు ఉన్నారు. భారత్‌లో కేవలం 271 మంది బిలియనీర్లు ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే అత్యధిక బిలియనీర్లు కలిగిన జాబితాలో న్యూయార్క్ 119 మంది బిలియనీర్లతో తొలి స్థానంలో నిలిచింది. 97 మంది బిలియనీర్లతో లండన్ రెండో స్థానంలో నిలిచింది. ఇక, ముంబై ఈ లిస్టులో 92 మంది బిలియనీర్లతో థర్డ్ ప్లేస్ లో నిలిచింది.
Read Also: Kishan Reddy: ఎన్డీయే కూటమికి 400సీట్లు రావడం ఖాయం..!
కాగా, హురూన్ లిస్ట్ ప్రకారం.. ఈ సంవత్సరంలో ముంబైలో కొత్తగా 26 మంది బిలియనీర్లు వచ్చి చేరగా.. ఇదే సమయంలో బీజింగ్ మాత్రం 18 మంది బిలియనీర్లను పూర్తిగా కోల్పోయింది. అలాగే, ముంబైలోని మొత్తం బిలియనీర్ల సంపద ఏకంగా 47 శాతం మేర పెరిగి 445 బిలియన్ డాలర్లకు చేరుకోగా.. ఇది భారత కరెన్సీలో చూస్తే 37 లక్షల కోట్ల రూపాయలకు పైనే ఉంది. మరోవైపు, బీజింగ్‌లోని మొత్తం బిలియనీర్ల సంపద 28 శాతంపైగా పడిపోయి 265 బిలియన్ డాలర్లకు చేరుకుంది. ఇది భారత కరెన్సీలో చూసినట్లయితే 22 లక్షల కోట్ల రూపాయలుగా ఉంది.
Read Also: Venky Sequel: వెంకీ సీక్వెల్ పై అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్ల..!
అలాగే, ముంబైలో ఎక్కువ సంపద ముకేశ్ అంబానీ దగ్గరే ఉన్నట్లు తెలిపింది. ఏడాది వ్యవధిలో చూసినా ఆయన సంపదే భారీగా పెరిగిపోయింది. ఇక ఎనర్జీ, ఫార్మాష్యూటికల్స్ లాంటి రంగాల్లో సంపద సృష్టి ఎక్కువగా పెరిగింది. ఇక, ఏడాదిలో బిగ్గెస్ట్ వెల్త్ గెయినర్‌గా మంగళ్ ప్రభాత్ లోధాదే రియల్ ఎస్టేట్ దిగ్గజం నిలిచింది. ప్రపంచ కుబేరుల జాబితాలో భారతీయుల సంఖ్య కాస్త తగ్గింది.. రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మాత్రం 10వ స్థానంలో నిలిచారు. ఇక అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ 15వ స్థానంలో ఉండిపోయారు.