Site icon NTV Telugu

Mumbai Municipal Elections: ముంబై ఎన్నికల్లో ఓవైసీ పార్టీ హవా

Mumbai Municipal Elections

Mumbai Municipal Elections

Mumbai Municipal Elections: మహారాష్ట్రలోని 29 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికల ఫలితాలు రాష్ట్ర రాజకీయాల్లోనే కాకుండా జాతీయ రాజకీయల్లో కూడా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. BMCలో అసదుద్దీన్ ఓవైసీ నేతృత్వంలోని AIMIM పార్టీ హవా కొనసాగుతుంది. ముంబై, నాందేడ్ సహా అనేక ముస్లిం ప్రాబల్య ప్రాంతాలలో AIMIM పార్టీ తన ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. BMCలో ఇప్పటికే ఈ పార్టీ రెండు స్థానాలను కూడా గెలుచుకుంది. అలాగే నాందేడ్‌లో 14 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అహల్యానగర్, చంద్రపూర్ మున్సిపల్ కార్పొరేషన్లలో కూడా ఓవైసీ పార్టీ మొదటిసారిగా బలమైన ఉనికిని చాటుతుంది.

READ ALSO: Hyderabad: మద్యం గ్లాస్‌ కోసం ఘర్షణ.. అన్నను చంపిన తమ్ముడు..

అహల్యానగర్‌లో AIMIM మూడు స్థానాలను గెలుచుకోగా, చంద్రాపూర్‌లో కూడా ఖాతా తెరిచింది. ఈ విజయం మహారాష్ట్ర పట్టణ రాజకీయాల్లో AIMIMకి కొత్త గుర్తింపును ఇస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మాలేగావ్‌లో ఒవైసీ పార్టీ 20 సీట్లతో నంబర్ 1 స్థానంలో ఉంది. శివసేన 18 సీట్లలో, సమాజ్ వాదీ పార్టీ 6 సీట్లలో ముందంజలో ఉన్నాయి. ఈ ఎన్నికలలో బీజేపీ-షిండే నేతృత్వంలోని మహాయుతి కూటమి దాదాపు అన్ని ప్రధాన మునిసిపల్ కార్పొరేషన్లలో ఆధిక్యాన్ని కొనసాగిస్తుంది.

READ ALSO: Dhurandhar 2: రికార్డులు తిరగరాయడానికి వస్తున్న ‘ధురంధర్ 2’.. రిలీజ్ అప్‌డేట్‌తో బాంబ్ పేల్చిన డైరెక్టర్!

Exit mobile version