Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Mumbai Indians Set A Target Of 156 Runs For Chennai Super Kings

CSK vs MI: వాహ్.. సీఎస్‌కే బౌలర్స్ అదరగొట్టారు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై..

Published Date :March 23, 2025 , 9:17 pm
By RAMAKRISHNA KENCHE
CSK vs MI: వాహ్.. సీఎస్‌కే బౌలర్స్ అదరగొట్టారు.. స్వల్ప స్కోర్‌కే పరిమితమైన ముంబై..
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్‌లో మూడవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (CSK) , ముంబై ఇండియన్స్ (MI) మధ్య జరుగుతోంది. ఈ మ్యాచ్ చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతోంది. చెన్నై జట్టు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. మొదట బ్యాటింగ్ చేసిన సూర్యకుమార్ సేన 155 పరుగులు సాధించింది. సీఎస్‌కే విజయానికి 156 పరుగులు అవసరం. తిలక్ వర్మ 31 పరుగులు చేయగా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 29 పరుగులు సాధించాడు. దీపక్ చాహర్(28) మంచి స్కోర్ కోసం చివరి వరకు ప్రయత్నించాడు. మిగతావారెవరూ కూడా నిలకడగా ఉండి పరుగులు సాధించలేకపోయారు. బౌలింగ్‌లో నూర్ అహ్మద్ రాణించాడు. నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. ఖలీల్ అహ్మద్ మూడు వికెట్లతో ఎంఐకి కళ్లెం వేశాడు.

READ MORE: Bangladesh: ఇబ్బందుల్లో మహ్మద్ యూనస్.. ఢాకాలో భారీగా సైన్యం.. తిరుగుబాటు పరిస్థితి..?

కాగా.. బరిలోకి దిగిన ముంబైకి ప‌వ‌ర్ ప్లేలో మంచి ఆరంభం ల‌భించ‌లేదు. ప‌వ‌ర్ ప్లే లో ముంబై ఇండియ‌న్స్ కు ప‌రుగులు వ‌చ్చాయి. కానీ.. తొలి ఓవర్ లోనే రోహిత్ శర్మ డక్ అవుట్ అయ్యాడు. వెంట వెంటనే మూడు వికెట్లు కోల్పోయింది. కీల‌క‌ బ్యాట్స్ మెన్స్ రోహిత్ శ‌ర్మ(0)తో పాటు ర్యాన్ రికెల్టన్ (13), విల్ జాక్స్(11) కూడా పెవిలియన్‌కు చేరుకున్నారు. నూర్ అహ్మద్ ఓవర్‌లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(29) స్టంప్ ఔట్ అయ్యాడు. నూర్ అహ్మద్ ఓవర్‌లో రాబిన్ మింజ్(3) బాదిన బంతి జడేజా చేతికి చిక్కింది. తిలక్ వర్మ రూపంలో ముంబై ఇండియన్స్ 6వ వికెట్ కోల్పోయింది. నూర్ అహ్మద్ బౌలింగ్ లో 31 పరుగుల వద్ద ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ కు చేరాడు. నూర్ అహ్మద్ న‌మ‌న్ ధీర్ (17) ను బౌల్డ్ చేశాడు. నాథన్ ఎల్లిస్(11) ఓవర్‌లో మిచెల్ సాంట్నర్‌ ఎల్‌బిడబ్ల్యూ ఔట్ అయ్యాడు. ఖలీల్ అహ్మద్ ఓవర్‌లో బౌల్ట్(1) వెనుదిరిగాడు. సత్యనారాయణ రాజు(1), దీపక్ చాహర్(28) నాటౌట్‌గా నిలిచారు. బౌలింగ్‌లో నూర్ అహ్మద్(4), ఖలీల్ అహ్మద్ (3) ఇద్దరూ రాణించారు. ర‌విచంద్రన్ అశ్విన్(1), నాథన్ ఎల్లిస్(1) చెరో వికెట్ పడగొట్టారు.

READ MORE: Encounter: జమ్మూ కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్.. ఉగ్రవాదుల్ని చుట్టుముట్టిన భద్రతా దళాలు..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • bcci
  • chennai super kings
  • cricket news
  • CSK Home Advantage
  • CSK vs MI

తాజావార్తలు

  • KKR vs LSG: 27 బంతుల్లో 7 సిక్సర్లు.. ఓటమి అంచు నుంచి లక్నోను గెలిపించిన ముకుల్ చౌదరి ఎవరు!

  • Astrology: ఏప్రిల్‌ 10, శుక్రవారం దినఫలాలు.. ఈ రాశివారికి శుభవార్త..

  • Royal Enfield: రాయల్ ఎన్‌ఫీల్డ్ మొదటి ఎలక్ట్రిక్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతో తెలుసా.?

  • Off The Record : కేక్ కోసం కొట్టుకున్నంత పనిచేశారా..?

  • Bumrah Vs Vaibhav: బుమ్రా బౌలింగ్ అంత భయంకరంగా ఏమీ లేదు.. వైభవ్ సూర్యవంశీ సంచలన వ్యాఖ్యలు..

ట్రెండింగ్‌

  • Rare Fish: వలకు చిక్కిన అరుదైన చేప.. ఆనందంలో మత్స్యకారుడు.. ఎగబడిన జనం..

  • Jamun Seed Powder : ఆ కాలంలో షుగర్‌ కంట్రోల్‌కు నేరేడు గింజల పొడి వాడేవారు.. తయారీ విధానం ఇలా..!

  • TCS ఉద్యోగులకు గుడ్ న్యూస్.. ఏప్రిల్ 1 నుండి జీతాల పెంపు.!

  • Ai+ నుంచి కొత్త గాడ్జెట్ల వర్షం.. PulseTab ట్యాబ్, NovaPods, RotateCam స్మార్ట్‌వాచ్ లాంచ్..!

  • బడ్జెట్, మిడ్‌రేంజ్, ప్రీమియం.. Nova 2 5G, Ultra, Flip మోడళ్లతో Ai+ ఎంట్రీ..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions