Site icon NTV Telugu

MI vs SRH : మరోసారి రాణించిన అభిషేక్ శర్మ.. ముంబై టార్గెట్ ఎంతంటే?

Mivssrh

Mivssrh

ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ – సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.

READ MORE: Deputy CM Pawan Kalyan: వేటగాళ్ల ఉచ్చులో పడి చిరుత మృతి.. పవన్‌ కల్యాణ్‌ కీలక ఆదేశాలు..

హైదరాబాద్‌కి ఇది స్వల్ప స్కోరు అనే చెప్పాలి. ముంబై ఇండియన్స్ ఈ మ్యాచ్‌ను కైవసం చేసుకోవాలంటే 163 పరుగులు చేయాల్సి ఉంది. వాస్తవానికి నేడు ముంబై బౌలర్ల ధాటికి హైదరాబాద్ బ్యాటర్లు తడబడ్డట్టు కనిపించింది. కాగా.. హైదరాబాద్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ 40 పరుగులు సాధించాడు. అదే మ్యాచ్‌లో అత్యధిక వ్యక్తిగత స్కోరు. క్లాసెన్(37) రాణించాడు. అనికేత్ (18) చివరి ఓవర్‌లో రెండు సిక్సులు బాదాడు. అదే ఓవర్‌లో ఒక సిక్సర్ బాదిన కమిన్స్(8) నాటౌట్‌గా నిలిచాడు.

READ MORE: Minister Ponmudy: ఆ మంత్రిపై కేసు నమోదు చేయండి.. హైకోర్టు ఆదేశం..

సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓపెనర్లు ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మలు మొదట బ్యాటింగ్ చేసేందుకు బరిలోకి దిగారు. ఏడు ఓవర్ల వరకు నిలకడగా ఆడారు. అనంతరం హార్దిక్‌ బౌలింగ్‌లో రాజ్‌ బావాకు క్యాచ్‌ ఇచ్చిన అభిషేక్‌ శర్మ (40) పెవిలియన్‌కు చేరాడు. ఇషాన్‌ కిషన్‌ (2)కూడా భారీ షాట్‌కు ప్రయత్నించి స్టంప్ ఔట్ అయ్యాడు. బుమ్రా బౌలింగ్‌లో భారీ షాట్‌కు యత్నించిన ట్రావిస్‌ హెడ్‌ (28) శాంట్నర్‌కు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరుకున్నాడు. ట్రెంట్ బౌల్ట్‌ బౌలింగ్‌లో నితీష్ కుమార్‌ రెడ్డి (19) వెనుదిరిగాడు. బుమ్రా బౌలింగ్‌లో హెన్రిచ్‌క్లాసెన్‌ (37) క్లీన్‌ బౌల్డ్‌ అయ్యాడు. మరోవైపు.. ముంబై బౌలర్లు విల్ జాక్స్ రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా , ట్రెంట్ బౌల్ట్, బుమ్రా ఒక్కో వికెట్ పడగొట్టారు.

Exit mobile version