ఐపీఎల్ 2025లో 33వ మ్యాచ్ గురువారం ముంబై ఇండియన్స్ - సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య జరుగుతోంది. వాంఖడే వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ముందుగా బౌలింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఇరు జట్లు ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగాయి. మొదట బ్యాటింగ్ చేసిన సన్ రైజర్స్ హైదరాబాద్ 5 వికెట్ల నష్టానికి 162 పరుగులు చేసింది.