రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ “ఫ్యామిలీ స్టార్”..స్టార్ డైరెక్టర్ పరుశురాం డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేదు.కానీ ఓటిటిలో మాత్రం ఈ సినిమాకు ఊహించని రెస్పాన్స్ వస్తుంది.ఫ్యామిలీ స్టార్ సినిమా తరువాత విజయ్ సెలెక్టివ్ గా సినిమాలను ఎంచుకుంటున్నాడు. నేడు విజయ్ దేవరకొండ బర్త్ డే కావడంతో తాను నటిస్తున్న వరుస సినిమాల అప్డేట్స్ వస్తున్నాయి.తాజాగా యంగ్ డైరెక్టర్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న సినిమా నుంచి మేకర్స్ విజయ్ కి బర్త్ డే కి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. తాజాగా VD12 సినిమా నుంచి మేకర్స్ స్పెషల్ అప్డేట్ ఇచ్చారు. సితార ఎంటర్టైన్మెంట్స్ లో విజయ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే..
ఈ సినిమాకు జెర్సీ మూవీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహిస్తున్నాడు . పీరియాడిక్ స్పై యాక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాపై ప్రేక్షకులలో అంచనాలు భారీగానే ఉన్నాయి. VD12 వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా తెరకెక్కతుంది.తాజాగా నేడు విజయ్ దేవరకొండ బర్త్డే కావడంతో సితార ఎంటర్టైన్మెంట్స్ విజయ్ కు బర్త్డే విషెస్ తెలుపుతూ VD12 మూవీ గురించి ఓ స్పెషల్ లెటర్ ను రిలీజ్ చేసారు.రౌడీ ఫ్యాన్స్ మరియు తెలుగు ఆడియన్స్ మీ సహనాన్నిమేము అభినందిస్తున్నాము.మా బ్యానర్ లో ఒక అద్భుతమైన సినిమా తీస్తున్నాము. ఈ సినిమా నుంచి అప్డేట్స్ కొంచెం లేట్ అవ్వొచ్చు కానీ మీకు మేము బెస్ట్ ఇస్తాము.ప్రస్తుతం వైజాగ్ లో ఈ సినిమాలోని మాసివ్ సీన్స్ ని షూటింగ్ చేస్తున్నాము.మా అందరికి ఇది ఎంతో ముఖ్యమైన సినిమా. త్వరలో ఓ గ్లింప్స్ వీడియో మీ కోసం రిలీజ్ చేస్తాము అని మేకర్స్ ప్రకటించారు.