టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ ఫుల్ స్పీడు మీరున్నాడు.. వరుసగా సినిమాలను అనౌన్స్ చేస్తున్నాడు. సందీప్ కిషన్, క్రియేటివ్ డైరెక్టర్ సివి కుమార్ వారి కాంబినేషన్‌లో వచ్చిన సెన్సేషనల్ హిట్ ప్రాజెక్ట్‌జెడ్ తర్వాత సెకండ్ పార్ట్ కోసం మరోసారి చేతులు కలిపారు.. ఈ సీక్వెల్ సినిమాకు ‘మాయావన్ ‘ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.. నిన్న ఈ సినిమా నుంచి సందీప్ కిషన్ బర్త్ డే సందర్బంగా పోస్టర్ ను రిలీజ్ చేశారు.. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ ను రిలీజ్ చేశారు..
ఈ చిత్ర పోస్టర్ ఆసక్తిగా మారింది.. సందీప్‌కిషన్ చేతిలో సూపర్ పవర్ వెపన్‌తో కనిపిస్తున్నారు. వైవిధ్యమైన కథతో రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ చిత్రమిదని, సందీప్‌కిషన్ పాత్ర సూపర్‌హీరో తరహాలో ఉంటుందని చిత్ర బృందం పేర్కొంది. తాజాగా విడుదలైన టీజర్ అద్భుతమైన సన్నివేశాలతో ఆకట్టుకుంటుంది..అడ్వాన్స్ హ్యూమనాయిడ్ తో భారీ యాక్షన్ తో వణుకుపుట్టిస్తుంది.. ఈ సినిమాలో సందీప్ కిషన్ పోలీస్ పాత్రలో కనిపించునున్నారు.. సైన్స్ ను ఉపయోగించుకొని ఏదో చేస్తున్న వారిని పట్టుకోవడం కోసం హీరో ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది.. మొత్తానికి వీడియో తెగ ట్రెండ్ అవుతుంది..
ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్‌నితిన్ ముఖేష్ కీలక పాత్రను పోషిస్తున్నారు.. భారీ బడ్జెట్ తో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.. ఎకె ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై రాంబ్రహ్మం సుంకర ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.. బాలీవుడ్ నటుడు, సాహో ఫేమ్ నీల్ నితిన్ ముఖేష్‌ను కీలక పాత్రలో నటిస్తున్నారు. సందీప్ కిషన్ సరసన ఆకాంక్ష రంజన్ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోంది.. ఇక ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు..