Mumbai: ఎయిర్‌పోర్టులో ప్రమాదం.. ఫ్లైట్ ఢీకొని 36 ఫ్లెమింగో పక్షుల మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ముంబై ఎయిర్‌పోర్టులో ప్రమాదం జరిగింది. ఓ విమానం ఢీకొనడంతో 36 ఫ్లెమింగో పక్షులు మృతి చెందాయి. ముంబై-దుబాయ్ ఎమిరేట్స్ విమానం ఢీకొని ఈ పక్షుల చనిపోయాయి. మరిన్ని పక్షుల కోసం ఫారెస్ట్ అధికారులు అన్వేషణ చేస్తున్నారు. ఫ్లైట్ ల్యాండ్ అయ్యే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటన సోమవారం రాత్రి ముంబయిలో చోటుచేసుకొంది.
ఇది కూడా చదవండి: KTM Duke Bike: అదిరిపోయే ఫీచర్స్ కేటిఎం కొత్త బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే ?
Also Read
దుబాయ్ నుంచి ముంబైకి వస్తున్న ఎమిరేట్స్ విమానం సోమవారం రాత్రి 9:30 గంటల సమయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. ఈ క్రమంలోనే ఆ వైపుగా ఎగురుతున్న ఫ్లెమింగో పక్షుల గుంపు విమానాన్ని ఢీకొన్నాయి. కాసేపటికి ఎయిర్‌పోర్టులో విమానం ల్యాండ్ అయింది. అయితే తీవ్రంగా గాయపడి వివిధ ప్రాంతాల్లో పడిపోయిన పక్షులను గుర్తించిన స్థానికులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. ఆ రాత్రి ఆయా ప్రాంతాల్లో 30 పైగా.. మరుసటిరోజు మరికొన్ని పక్షుల కళేబరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ జాతి పక్షులు ఈ ప్రాంతంలో కనిపించడం అరుదని అధికారులు తెలిపారు.
ఇది కూడా చదవండి: Manish Sisodia: హైకోర్టులో చుక్కెదురు.. సిసోడియా బెయిల్ పిటిషన్ కొట్టివేత
ప్రమాదంపై దర్యాప్తు మొదలుపెట్టిన అధికారులు.. మరణించిన పక్షులకు పోస్టుమార్టం నిర్వహించారు. ఈ ఫలితాలు వచ్చేందుకు నాలుగురోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలంటూ పర్యావరణ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి: Aadhaar Of Dead Person: అసలు మరణించిన వ్యక్తి ఆధార్ ఏమవుతుందో తెలుసా..
తాజావార్తలు
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
-
Story Board : దేశ ప్రజల స్వరం మారుతోంది..కేంద్రంపై అసంతృప్తి ,ఆవేశం మరింత రాజుకుంటే…
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!