Site icon NTV Telugu

Suryakumar Yadav: ప్రపంచ రికార్డు సృష్టించిన సూర్యకుమార్‌ యాదవ్

Suryakumar Yadav

Suryakumar Yadav

Suryakumar Yadav: బుధవారం జరిగిన దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్‌ ఘన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌లు అర్థశతకాలతో చెలరేగిపోవడంతో టీమిండియా సులభంగా విజయతీరాలకు చేరింది. ఈ టీ20 మ్యాచ్‌లో భారత బ్యాట్స్‌మన్ సూర్యకుమార్‌ యాదవ్ పలు రికార్డులను సొంతం చేసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 50 పరుగులు చేసిన సూర్యకుమార్ యాదవ్.. ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక పరుగులు(732) చేసిన ఆటగాడిగా నిలిచాడు. శిఖర్‌ ధావన్(689), కోహ్లీ(641) రికార్డులను బ్రేక్‌ చేశాడు.

Saniya Iyappan: టచ్ చేసిన ఫ్యాన్.. లాగి పెట్టి కొట్టిన హీరోయిన్

అలాగే ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక సిక్స్‌లు(45) కొట్టి ప్రపంచ రికార్డు సృష్టించాడు. అంతకు ముందు 2021లో రిజ్వాన్‌ 42, గప్టిల్ 41 సిక్సర్లు బాదారు. బుధవారం దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో ఛేదనలో సూర్యకుమార్‌ యాదవే భారత్‌ హీరో. కఠినమైన పిచ్‌పై పరీక్షించే పరిస్థితుల్లో చక్కని బ్యాటింగ్‌తో రాహుల్‌తో కలిసి అతడు జట్టును విజయపథంలో నడిపించాడు.

Exit mobile version