Saniya Iyappan: టచ్ చేసిన ఫ్యాన్.. లాగి పెట్టి కొట్టిన హీరోయిన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saniya Iyappan Slapped Fan For Misbehaving In A Mall: పబ్లిక్ ప్రాంతాల్లో సెలెబ్రిటీలు వచ్చినప్పుడు.. ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. తమ అభిమాన తారను కలవాలని, ఒక్క ఫోటో దిగాలన్న ఉత్సాహంతో.. గుంపులు గుంపులుగా ఒక్కసారిగా ఎగబడతారు. అప్పుడు గందరగోళ వాతావరణం నెలకొంటుంది. సెక్యూరిటీ సైతం వారిని అదుపు చేయలేక తంటాలు పడతారు. ఇలాంటప్పుడు కొందరు దుండగులు దుశ్చర్యలకు పాల్పడుతుంటారు. ముఖ్యంగా.. హీరోయిన్ల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తుంటారు. ఎక్కడపడితే అక్కడ తాకుతారు. అలాంటి అనుభవమే ‘సాటర్‌డే నైట్’ సినిమా కథానాయికలకు తాజాగా ఎదురైంది.
అయితే.. ఆ ఇద్దరిలో ఒకరైన సానియా అయ్యప్పన్ అందరిలా సైలెంట్‌గా ఉండకుండా, తనని టచ్ చేసిన అభిమానికి అక్కడే బుద్ధి చెప్పింది. లాగి పెట్టి కొట్టింది. తమ సినిమా ప్రచారం కోసం కోజికోడ్‌లోని ఓ మాల్‌కు సానియాతో పాటు గ్రేస్ ఆంటోని వెళ్లారు. ప్రమోషన్ కార్యక్రమాల్ని ముగించుకొని, తిరిగి వస్తున్న క్రమంలో.. ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. ఇద్దరిపై చేతులు వేసి వేధించాడు. దీంతో కోపాద్రిక్తురాలైన సానియా అయ్యప్పన్.. వెంటనే అతడి చెంప ఛెళ్లుమనిపించింది. ఈ ఘటనను ఒకరు కెమెరాలో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయ్యింది. ఈ ఘటనపై అదే రోజు రాత్రి ఇన్‌స్టాగ్రామ్ మాధ్యమంగా స్పందిస్తూ.. అనుచితంగా ప్రవర్తించిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు.
Also Read
- Jailer 2 Ticket Price Hike: ఏపీలో 'జైలర్ 2' టికెట్ రేట్లు హైక్.. సింగిల్ స్క్రీన్లు, మల్టీప్లెక్స్‌లలో కొత్త ధరలు ఇవే!
- The Paradise: మళ్లీ ట్రోలింగ్ వద్దని నాని ప్లాన్.. 'ది ప్యారడైజ్' ఓటీటీలో ఊహించని మార్పులు!
- RT78: అఫీషియల్.. రవితేజ 78వ మూవీ డైరెక్టర్ అతనే!
- Allu Arjun: లేడీ ఓరియెంటెడ్ సినిమా అని తెలిసీనా దిగాడు.. బన్నీ చేసిన ఆ 'బిగ్ రిస్క్'!
‘‘కాలికట్‌లోని ఒక మాల్‌లో మా ‘సాటర్‌డే నైట్’ ప్రమోషన్ కార్యక్రమాల్ని ముగించుకొని వస్తున్నప్పుడు.. జనాలు ఒక్కసారిగా ఎగబడ్డారు. వారిని సెక్యూరిటీ సైతం నియంత్రించలేక తంటాలు పడింది. అప్పుడు నా కో-స్టార్ పట్ల ఒక వ్యక్తి అనుచితంగా ప్రవర్తించాడు. అయితే.. రద్దీ ఎక్కువగా ఉండటంతో ఆమె రియాక్ట్ అవ్వలేకపోయింది. ఆ తర్వాత నాకూ అలాంటి చేదు అనుభవమే ఎదురైంది. కానీ కోపమొచ్చి మీరు వీడియోలో చూసినట్టు అతడ్ని లాగి పెట్టి కొట్టాను. భవిష్యత్తులో మాలాగా ఇలాంటి ఇబ్బందులు ఎదురవ్వకుండా నిందితులపై చర్యలు తీసుకోవాలి’’ అని సానియా పోస్ట్ పెట్టింది. ఈ ఘటనను తీవ్రంగా ఖండించిన కేరళ రాష్ట్ర మహిళ కమిషన్ చీఫ్ పి. సతీదేవి.. నిందితుల్ని అరెస్ట్ చేయాలని పోలీసుల్ని ఆదేశించారు.
#SaturdayNight promotion event scenes. From Calicut Hilite Mall😯 pic.twitter.com/Zt16hPRTau
— ForumKeralam (@Forumkeralam2) September 27, 2022
తాజావార్తలు
-
AP Cabinet: రేపు ఏపీ కేబినెట్ అత్యవసర సమావేశం.. వాటిపైనే కీలక చర్చ..
-
Supreme Court: ‘‘రవాణాను పూర్తిగా నిలిపివేయలేరు’’.. ఢిల్లీ ఆంక్షలపై సుప్రీంకోర్టు
-
Amit Shah: రాహుల్ గాంధీ అబద్ధాల మధ్య బీజేపీ వరస విజయాలు..
-
Delhi Traffic: ఢిల్లీ ట్రాఫిక్‌పై ఆంక్షలు.. 30 ప్రాంతాల్లో వాహనాల రాకపోకలకు అంతరాయం..
-
Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు