Mukesh Kumar Debut: వికెట్ ఏమీ పడగొట్టకున్నా.. రెండో భారత ఆటగాడిగా ముఖేష్ కుమార్ అరుదైన రికార్డు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mukesh Kumar Becomes Second Indian to Rare Achievement: భారత పేసర్ ముఖేష్ కుమార్ అరుదైన అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం చేసిన రెండో భారత ఆటగాడిగా రికార్డుల్లో నిలిచాడు. గురువారం రాత్రి ట్రినిడాడ్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో ఆడిన ముఖేష్.. ఈ అరుదైన ఫీట్‌ను తన పేరుపై లిఖించుకున్నాడు. ఇదే పర్యటనలో ముఖేష్ వెస్టిండీస్‌పై టెస్టు, వన్డే అరంగేట్రం చేసిన విషయం తెలిసిందే. ఐపీఎల్ 2023లో రాణించిన ముఖేష్‌కు భారత జట్టులో చోటుదక్కింది.
ఒకే టూర్‌లో మూడు ఫార్మాట్‌లలో అరంగేట్రం చేసిన మొదటి ఆటగాడిగా టీమిండియా పేసర్ తంగరసు నట్‌రాజన్ ఉన్నాడు. 2021లో ఆస్ట్రేలియా పర్యటనలో మూడు ఫార్మాట్‌లలో అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. నట్‌రాజన్ ఆసీస్ గడ్డపై టెస్టు, వన్డే మరియు టీ20 అరంగేట్రం చేశాడు. ఇపుడు విండీస్ గడ్డపై ముఖేష్ కుమార్ కూడా టెస్టు, వన్డే మరియు టీ20ల్లో అరంగేట్రం చేశాడు.
Also Read
- Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
తొలి టీ20లో3 ఓవర్లు బౌలింగ్ చేసిన ముఖేష్ కుమార్.. 24 పరుగులు ఇచ్చి ఒక వికెట్ కూడా పడగొట్టలేదు. అయితే విండీస్‌తో జరిగిన మూడో వన్డేలో అద్బుతమైనతో ఆకట్టుకున్నాడు. మూడు కీలక వికెట్లు తీసి భారత జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. అంతకుముందు ఆడిన ఓ టెస్టులో 2 వికెట్స్ తీశాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచులు ఆడిన అతడు 6 వికెట్స్ తీశాడు. ఇక తొలి టీ20లో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 150 పరుగుల లక్ష్య ఛేదనలో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 145 పరుగులు మాత్రమే చేసింది.
Also Read: Andy Flower RCB Coach: ఆర్‌సీబీ హెడ్ కోచ్‌గా జింబాబ్వే మాజీ క్రికెటర్.. ఇక కప్పు ఖాయం!
Mukesh Kumar in this West Indies tour:
– Test debut on July 20th.
– ODI debut on July 27th.
– T20I debut on August 3rd.A dream tour for Mukesh Kumar. pic.twitter.com/qakYzFot2X
— Johns. (@CricCrazyJohns) August 3, 2023
తాజావార్తలు
-
Ind vs Afg T20 : ఆఫ్ఘన్‌పై భారత్ జోరు.. సిరీస్ కైవసం.!
-
Story Board : దిగ్గజాలు వద్దంటున్నారు..ట్రంప్ కావాలంటున్నారు..అసలు ఏఐ విషయంలో ఏం జరుగుతోంది..?
-
Ind vs Afg: సంజూ శాంసన్ ఉగ్రరూపం.. కొడితే సిక్స్ పోవాల్సిందే.. దూకుడే దూకుడు..
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్‌లో ఏం మాట్లాడుకున్నారు..?
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్‌ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్‌ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?