Mukesh Ambani: జులై 12న అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. ఇకపోతే తాజాగా అంబానీ కుటుంబానికి చెందిన చిన్న కోడలు రాధిక వీడ్కోలు కార్యక్రమం వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. ఈ వీడియోలో అనంత్ అంబానీ తండ్రి ప్రముఖ పారిశ్రామిక వేత్త ముకేశ్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ చాలా ఎమోషనల్ గా కనిపించారు. ఆ సమయంలో కన్నీరు కారుస్తున్నట్టుగా వీడియోలో గమనించవచ్చు. పెళ్లి కార్యక్రమం తర్వాత అంబానీ కుటుంబం తమ కోడలను యాం లియాకు స్వాగతించింది. ఈ సందర్భంగా కొత్త దంపతులకు ఆశీర్వాద కార్యక్రమం చేశారు. ఈ కార్యక్రమంలో కొందరు ప్రముఖులు కూడా పాల్గొన్నారు. దీంతో అంబానీ చిన్న కోడలు వేడుక కార్యక్రమం సంబంధించిన వీడియో బయటికి వచ్చింది.
Gold Rates Today: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు!
ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో అక్కడ ఉన్న వారందరూ కాస్త ఎమోషనల్ గా కనిపించారు. కోడలు వీడ్కోలు కార్యక్రమం వద్ద అత్తయ్య నీతా అంబానీ, ముఖేష్ అంబానీలు ఎమోషనల్ గా కనిపించారు. ఈ వీడియోలో ముకేశ్ అంబానీ కొద్దిపాటి కన్నీళ్లు పెట్టుకోవడం ఇప్పుడు అందరిని ఆకర్షించింది. గత సంవత్సరం ఎంగేజ్మెంట్ జరిగిన కార్యక్రమం నుండి జూలై 14 , 2024 వరకు పెళ్లి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగానే మర్చి నెలలో ఫ్రీ వెడ్డింగ్ ఫంక్షన్ ని కూడా జరిపించారు. జూలై 5 న ముంబైలో వివాహ కార్యక్రమాలు మొదలవగా.. జూలై 12న వివాహ బంధంతో ఒకటయ్యారు. ఈ వీడియోలో పెళ్లికూతురు రాధికామార్చంట్ కూడా కండతడి పెట్టడం గమనించవచ్చు.
Lionel Messi Crying: వెక్కివెక్కి ఏడ్చిన లియోనెల్ మెస్సీ.. వీడియో వైరల్!