NTV Telugu Site icon

Worlds Billionaires: యుద్ధం ఎఫెక్ట్.. రాత్రికి రాత్రే తలకిందులైన ప్రపంచ ధనవంతుల జాబితా..

Worlds Billionaires

Worlds Billionaires

ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తత కారణంగా గురువారం ప్రపంచవ్యాప్తంగా స్టాక్ మార్కెట్లు పతనమయ్యాయి. దీంతో సంపన్నుల జాబితాలో భారీ మార్పులు చోటుచేసుకున్నాయి. టాప్ 20లో ముగ్గురు ధనవంతుల నికర విలువ పెరిగింది. ఇందులో ఫేస్‌బుక్ మాతృ సంస్థ మెటా ప్లాట్‌ఫామ్ సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్, ఎన్విడియా సీఈవో జెన్సన్ హువాంగ్ , డెల్ కార్పొరేషన్‌కు చెందిన మైఖేల్ డెల్ ఉన్నారు. ఈ వృద్ధితో జుకర్‌బర్గ్ ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండో స్థానానికి చేరుకున్నారు. ఆసియాలోనే అతిపెద్ద సంపన్నులు ముఖేష్ అంబానీ , గౌతమ్ అదానీలు భారీ నష్టాన్ని చవిచూశారు.

READ MORE: Stock market: పశ్చిమాసియా దెబ్బకు మార్కెట్ కుదేల్.. భారీ నష్టాలతో ముగిసిన సూచీలు

గురువారం నాడు జుకర్‌బర్గ్ నికర విలువ 3.43 బిలియన్ డాలర్లు పెరిగింది. ఆయన 206 బిలియన్ డాలర్లతో ప్రపంచ సంపన్నుల జాబితాలో రెండవ స్థానానికి చేరుకున్నారు. ఈ సంవత్సరం ఆయన నికర విలువ అత్యధికంగా $78.1 బిలియన్లు పెరిగింది. 256 బిలియన్ డాలర్ల సంపదతో ఎలాన్ మస్క్ నంబర్ వన్ స్థానంలో ఉన్నారు. జెఫ్ బెజోస్ 205 బిలియన్ డాలర్ల సంపదతో మూడో స్థానానికి దిగజారగా, ఫ్రెంచ్ వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్ 193 బిలియన్ డాలర్లతో నాలుగో స్థానంలో ఉన్నారు.

READ MORE:Devara: వారం రోజులు.. 410 కోట్లు.. నోళ్లు మూయించారు!

అంబానీ-అదానీల పరిస్థితి
మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ 14వ స్థానానికి పడిపోయారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు గురువారం పతనమయ్యాయి. దీని కారణంగా అంబానీ నికర విలువ 4.29 బిలియన్ డాలర్లు క్షీణించింది. ఇప్పుడు ఆయన నికర విలువ 107 బిలియన్ డాలర్లు. ఈ ఏడాది నికర విలువ 10.5 బిలియన్ డాలర్లు తగ్గింది. అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ నికర విలువ 2.93 బిలియన్ డాలర్లు తగ్గి 100 బిలియన్ డాలర్లతో 17వ స్థానానికి పడిపోయింది. ఈ ఏడాది ఆయన నికర విలువ 16.1 బిలియన్ డాలర్లు పెరిగింది.