Ambani Vs Adani : భారత్, ఆసియాలో అత్యంత ధనవంతుడు ఎవరు అనే విషయంలో గత ఏడాదిన్నర కాలంలో అనేక మార్పులు వచ్చాయి. దేశంలోని ఇద్దరు అగ్ర సంపన్నులు ముఖేష్ అంబానీ, గౌతమ్ అదానీల మధ్య నంబర్ వన్ స్థానం కోసం గట్టి పోటీ నడుస్తోంది. ఇటీవల, గౌతమ్ అదానీ భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా నిలవడంలో సక్సెస్ అయ్యాడు. అయితే కొద్ది రోజుల్లోనే ముఖేష్ అంబానీ మళ్లీ నంబర్ వన్ అయ్యాడు.
ముఖేష్ అంబానీ ప్రస్తుత నికర విలువ
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ ప్రస్తుతం దేశంలోనే అత్యంత ధనవంతుడు. జనవరి 8 సోమవారం ఉదయం ఇండెక్స్‌లో ముఖేష్ అంబానీ మొత్తం నికర విలువ 97.5 బిలియన్ డాలర్లు. అంబానీ నికర విలువ గత 24 గంటల్లో 536 మిలియన్ డాలర్లు పెరిగింది. దీంతో ముఖేష్ అంబానీ మళ్లీ భారత్, ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ప్రపంచ స్థాయిలో ప్రస్తుతం 12వ స్థానంలో ఉన్నాడు.
Read Also:Telangana Free Bus: ఒరిజినల్ ఆధార్ ఉండాల్సిందే.. జిరాక్స్ చూపిస్తే బస్సు దిగాల్సిందే..
పడిపోయిన గౌతమ్ అదానీ సంపద
అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ గత 24 గంటల్లో నష్టపోయారు. ప్రస్తుతం అదానీ నికర విలువ 3.09 బిలియన్ డాలర్లు తగ్గింది. ఇప్పుడు గౌతమ్ అదానీ నికర విలువ 94.5 బిలియన్ డాలర్లకు పడిపోయింది. ఈ సంపదతో అదానీ ఇప్పుడు భారతదేశంలో రెండవ అత్యంత సంపన్న వ్యక్తి, ప్రపంచవ్యాప్తంగా 14వ స్థానంలో ఉన్నారు.
ఫోర్బ్స్ రియల్ టైమ్ బిలియనీర్ల జాబితా ప్రకారం.. గౌతమ్ అదానీ కంటే ముఖేష్ అంబానీ ముందున్నారు. ఈ జాబితా ప్రకారం ముఖేష్ అంబానీ ప్రస్తుత నికర విలువ 100.9 బిలియన్ డాలర్లు, అతను ప్రపంచంలోని 12వ అత్యంత సంపన్న వ్యక్తి. గౌతమ్ అదానీ 78.2 బిలియన్ డాలర్ల మొత్తం సంపదతో ఫోర్బ్స్ ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో 16వ స్థానంలో నిలిచారు.
Read Also:Vijay-Rashmika: ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎంగేజ్‌మెంట్?
అదానీ గ్రూప్ షేర్లలో అద్భుతమైన ర్యాలీ ఆధారంగా 2022 చివరి నెలల్లో గౌతమ్ అదానీ తొలిసారిగా ముఖేష్ అంబానీని అధిగమించారు. అతను భారతదేశం, ఆసియాలో అత్యంత సంపన్న వ్యక్తిగా 2023 సంవత్సరాన్ని ప్రారంభించాడు. ఆ సమయంలో అతని సంపద 120 బిలియన్ డాలర్లు దాటింది. దీంతో ప్రపంచంలోని టాప్-3 ధనవంతులలో ఒకటిగా నిలిచాడు. అయితే, ఆ తర్వాత జనవరి 2023లో వచ్చిన హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్ అదానీకి పెద్ద నష్టాన్ని కలిగించింది. హిండెన్‌బర్గ్ రీసెర్చ్ నివేదిక తర్వాత, అదానీ గ్రూప్‌లోని అన్ని షేర్లలో భారీ పతనం జరిగింది. ఆ కారణంగా ప్రపంచంలోని అత్యంత సంపన్నుల జాబితాలో గౌతమ్ అదానీ టాప్-30 నుండి నిష్క్రమించాడు. గత కొన్ని నెలలుగా అదానీ గ్రూప్ షేర్లు మళ్లీ ఊపందుకున్నాయి. ఇది గౌతమ్ అదానీ సంపదను పెంచడంలో దోహదపడింది.