NTV Telugu Site icon

Mumbai Indians: ముంబై ఇండియన్స్ జట్టులో మార్పులు.. కీలక ఆటగాడు ఎంట్రీ

Mujeeb Ur Rahma

Mujeeb Ur Rahma

ముంబై ఇండియన్స్ తమ జట్టులో మార్పులు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మిస్టరీ స్పిన్నర్ అల్లా గజన్‌ఫర్ గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి తప్పుకున్నాడు. అయితే.. అతని స్థానంలో ముంబై ఇండియన్స్.. ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహమాన్‌ను జట్టులోకి తీసుకుంది. ముజీబ్ ఉర్ రెహమాన్.. తన దేశం తరపున ఆడిన అతి పిన్న వయస్కులలో ఒకరు. 17 సంవత్సరాల వయస్సులోనే ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన ముజీబ్.. అద్భుత బౌలింగ్‌తో అదరగొట్టాడు. ప్రస్తుతం.. అతనికి 300 పైగా T20 (అంతర్జాతీయ మరియు దేశీయ) మ్యాచ్‌ల అనుభవం ఉంది. ఇందులో దాదాపు 6.5 ఎకానమీతో 330 వికెట్లు పడగొట్టాడు. 19 ఐపీఎల్ మ్యాచ్‌లలో 19 వికెట్లు సాధించిన ముజీబ్.. ఈ సీజన్‌లో 2 కోట్ల రూపాయల ఒప్పందంతో ముంబై ఇండియన్స్‌లో చేరాడు.

Read Also: Double Murder: ఆస్తి కోసం తల్లిదండ్రులను సుత్తితో కొట్టి చంపిన కొడుకు..

ముంబై ఇండియన్స్ జట్టులో గజన్‌ఫర్‌ని దాదాపు 3.5 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే.. గాయం కారణంగా అతను ఈ సీజన్‌కు దూరంగా ఉండనున్నాడు. ముజీబ్ ఈ సీజన్‌లో గజన్‌ఫర్ స్థానాన్ని భర్తీ చేయబోతున్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు ఇదొక్కటే సమస్య కాదు.. ఆ జట్టు స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రాకు కూడా గాయమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని ఎన్‌సీఏలో శిక్షణ పొందుతున్నాడు. అయితే.. అతను ఐపీఎల్ 2025 సీజన్‌లో అందుబాటులో ఉంటాడా లేదా అనే విషయం ఇంకా క్లారిటీ లేదు. ఐపీఎల్ కంటే ముందు బుమ్రా 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా పాల్గొనకపోవచ్చు.

Read Also: Bird Flu Outbreak: బర్డ్ఫ్లూ ఎఫెక్ట్.. గుంటూరులో చికెన్ అమ్మకాలు మాత్రం..