Fire Accident: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇంట్లో అగ్ని ప్రమాదం.. నిప్పు పెట్టిన దుండగులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బంగ్లాదేశ్‌లో మళ్లీ చెలరేగిన అల్లర్లు, దహనకాండ నేపథ్యంలో నోబెల్ బహుమతి గ్రహీత, ఆ దేశ మాజీ తాత్కాలిక ప్రభుత్వ ప్రధాన సలహాదారు ప్రొఫెసర్ ముహమ్మద్ యూనస్ పూర్వీకుల ఇంటికి దుండగులు నిప్పు పెట్టారు. నవంబర్ 18, బుధవారం రాత్రి 11.30 గంటల సమయంలో చట్టోగ్రామ్ నగరంలోని పాంచ్లైష్ ప్రాంతంలో ఉన్న నాలుగు అంతస్తుల భవనంలో ఈ ఘటన చోటుచేసుకుంది. గుర్తుతెలియని వ్యక్తులు భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న ఓ పాడుబడిన గదికి నిప్పు పెట్టినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో ఆ ప్రాంతంలో సాధారణ గస్తీ నిర్వహిస్తున్న పోలీసులు మంటలను గమనించి వెంటనే లోపలికి ప్రవేశించి మంటలను అదుపులోకి తెచ్చారని పాంచ్లైష్ పోలీస్ స్టేషన్ అధికారి మొజమ్మెల్ హక్ తెలిపారు. ఆ భవనం గ్రౌండ్ ఫ్లోర్లో ఎవరూ నివసించడం లేదని, మంటలు చెలరేగిన గది కూడా చాలా ఏళ్లుగా ఉపయోగంలో లేదని ఆయన పేర్కొన్నారు.
అయితే.. రెండో, మూడో అంతస్తులలో యూనస్ ఇద్దరు సోదరుల కుటుంబాలు నివాసముంటున్నాయి. ఈ ఘటన తర్వాత ఆ ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు, నిందితులను పట్టుకునేందుకు దర్యాప్తు ప్రారంభించారు. బంగ్లాదేశ్‌లో ఇటీవల యూనస్‌కు సంబంధించిన ఆస్తులు, సంస్థలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయి. ఆయన స్థాపించిన గ్రామీణ్ బ్యాంక్‌కు చెందిన రెండు శాఖలకు కూడా ఇటీవల చట్టోగ్రామ్‌లోని అన్వారా, సత్కానియా ప్రాంతాల్లో దుండగులు నిప్పు పెట్టారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలు యూనస్‌కు సంబంధించిన సంస్థల భద్రతపై ఆందోళన కలిగిస్తున్నాయి.
Also Read
- Dawood Ibrahim: పాకిస్థాన్‌లో దావూద్ ఇంకా ఫుల్ యాక్టివ్.. మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ బయటపెట్టిన సంచలన నిజాలు
- CM Revanth Reddy: క్యూర్, ప్యూర్, రేర్.. తెలంగాణ సమగ్రాభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి మూడు రీజియన్ల ఫార్ములా..
- Azam Khan Released From Jail: ఇక ఎన్నికలు కాదు.. విప్లవమే వస్తుంది! అజం ఖాన్ సంచలన వ్యాఖ్యలు
- Nasha MuktBharat: డ్రగ్స్ మహమ్మారిపై సమరశంఖం.. 'నషా ముక్త్ భారత్ యాత్ర'కు కింగ్ నాగార్జున మద్దతు..
మైక్రోఫైనాన్స్ రంగంలో చేసిన కృషికి 2006లో నోబెల్ శాంతి బహుమతి పొందిన యూనస్, విద్యార్థుల నిరసనలతో మాజీ ప్రధాని షేక్ హసీనా పదవి నుంచి వైదొలిగిన 2024 ఆగస్టు 8న బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధినేతగా బాధ్యతలు చేపట్టారు. 2026 ఫిబ్రవరి 12న దేశంలో పార్లమెంటరీ ఎన్నికలు జరిగే వరకు ఆయన పదవిలో కొనసాగారు. ఆ తర్వాత ఫిబ్రవరి 17న బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ నేత తారిఖ్ రెహమాన్ ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో యూనస్ తాత్కాలిక పాలన ముగిసింది. తాజా అగ్నిప్రమాదం వెనుక ఉన్న ఉద్దేశం ఇంకా స్పష్టంగా తెలియరాలేదని, గ్రామీణ్ బ్యాంక్ శాఖలపై జరిగిన దాడులకు, ఈ ఘటనకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో విచారణ జరుపుతున్నామని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Fire Accident: నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఇంట్లో అగ్ని ప్రమాదం.. నిప్పు పెట్టిన దుండగులు..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ సూర్యవంశీకి అరుదైన గౌరవం!
-
Dawood Ibrahim: పాకిస్థాన్‌లో దావూద్ ఇంకా ఫుల్ యాక్టివ్.. మాజీ ఎఫ్‌బీఐ ఏజెంట్ బయటపెట్టిన సంచలన నిజాలు
-
Itel City 300 5G: కొత్త కలర్ వేరియంట్లలో itel City 300 5G లాంచ్.. 13MP కెమెరా, 5000mAh బ్యాటరీ!
-
Aditya Dhar: రణ్వీర్ సింగ్‌తోనే ఆదిత్య ధర్ మూవీ.. ఈసారి మరో డ్రీమ్ ప్రాజెక్ట్!
ట్రెండింగ్
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!