Mudragada Padmanabham: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై సెటైర్లు వేశారు కాపు ఉద్యమ నేత, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ముద్రగడ పద్మనాభం.. కూటమిలో పవన్ కల్యాణ్ తీసుకున్న 20 సీట్లను కూడా త్యాగం చేసి జనసేన పార్టీ ప్యాకప్ చేస్తే.. త్యాగశీలిగా పేరు వస్తుందని ఎద్దేవా చేశారు.. పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో జరిగిన ఆత్మీయ సమావేశంలో ముద్రగడ మాట్లాడుతూ.. పవన్ కల్యాణ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.. క్లబ్బులు నడిపే వాళ్లచేత నన్ను పవన్ కల్యాణ్ తిట్టిస్తున్నారని.. దమ్ము ఉంటే ప్రెస్ మీట్ పెట్టీ నన్ను తిట్టండి అంటూ సవాల్ విసిరారు ముద్రగడ. ఇక, వైఎస్ జగన్మోహన్‌రెడ్డి.. ముఖ్యమంత్రి అయ్యాక ఉద్యమం ఎందుకు ఆపేశారు అంటున్న పవన్ కల్యాణ్.. చంద్రబాబు సీఎం అయ్యాక మీరు ఏ మడుగులో దాక్కున్నారని ప్రశ్నించారు. చాటున ఉండి మాట్లాడటం మగతనం అనిపించుకోదని మండిపడ్డారు. చంద్రబాబు తన తనయుడు లోకేషన్ తో పాదయాత్ర చేయించింది పవన్ కల్యాణ్‌ను ముఖ్యమంత్రిని చేయడానికి కాదన్నారు ముద్రగడ.
Read Also: Ring Riyaz: సీఎం జగన్‌ను ట్రోల్ చేసి ఫేమస్.. ఇప్పుడు ఆయన పక్కనే కూర్చుని ఫొటో!
మరోవైపు.. ముద్రగడ పద్మనాభంపై ప్రశంసలు కురిపించారు మంత్రి కారుమూరి.. ముద్రగడ జీవితం కొవ్వత్తి.. తాను కరిగిపోతూ ఎంతో మందికి వెలుగు ఇచ్చారని పేర్కొన్నారు. కాపులను అడ్డు పెట్టుకొని కొందరు పైకి రావడానికి చూస్తున్నారు.. కానీ, తన జాతిపైకి రావడానికి ముద్రగడ ఆలోచిస్తున్నారని పేర్కొన్నారు. కాపుల సహకారం వల్లే నేను ఈ స్థాయికి వచ్చాను.. పేదలకు మేలు చేయాలని ఆలోచించే సీఎం జగన్ కు ముద్రగడ తోడు కావడంతో మరిన్ని మంచిపనులు చేసే అవకాశం వచ్చిందన్నారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు. ఇక, కరోనా మహమ్మారితో రెండేళ్లు అంతా ఇబ్బంది పడినా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకున్నవన్ని చేశారు.. మద్యం కూడా ఆపేస్తారు.. ఒకటో తేదీనో ఎప్పుడో అది కూడా జరుగుతుందని ప్రకటించారు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు..