Mudragada Padmanabham: సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. ఈ రోజు విపక్షాలపై ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు.. పార్టీ ఆదేశిస్తే పోటీకి సిద్ధమని ప్రకటించిన ఆయన.. జనసేన వేరే పార్టీలో కలవడం కాదు త్వరలోనే క్లోజ్ అయిపోతుందని జోస్యం చెప్పారు.. పిఠాపురంలో వైసీపీకి సునాయాసంగా ఉంటుందన్న ఆయన.. సినిమావాళ్లు అతీతులు కాదు.. మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు.. మా ఇంటికొస్తే ఏం తెస్తారు అనే విధంగా సినిమా వాళ్ల వ్యవహారం ఉంటుందని దుయ్యబట్టారు.. ఇక, 175 సీట్లలో పోటీ చేస్తానంటే బీజేపీ లో చేరతా అని చెప్పాను.. మీరు పోటీ చేసే 5-6 సీట్లలో నన్ను లాగొద్దు అని చెప్పాను.. జనసేన 70-80 సీట్లలో పోటీ చేయకుండా.. 20 సీట్లు కోసం నేను ఎందుకు? అని ప్రశ్నించారు. పవన్ కల్యాణ్‌ను మొత్తం సీట్లు త్యాగం చేయమనండి.. ఇంకా బాగుంటుంది అంటూ సెటైర్లు వేశారు.
Read Also: Bhoothaddam Bhaskar Narayana OTT: ఓటీటీలోకి రాబోతున్న థ్రిల్లర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ఎన్టీఆర్ తర్వాత సినిమా నటులను ప్రజలు నమ్మలేదు అన్నారు ముద్రడగ.. నిన్న సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీలో చేరాను.. కొన్ని శక్తులు నన్ను ఇంతకాలం సీఎం జగన్‌కి దూరం చేశారు… కానీ, వైసీపీ పార్టీ ఫౌండర్స్ లో నేను ఒక్కడిని అన్నారు. జగన్ ను సీఎం చేయడానికి నా ప్రయత్నం చేస్తాను అన్నారు. ఇక, మా కుటుంబం 1951 సినిమాలలోకి వచ్చేటప్పటికి ఇప్పుడు ఉన్న నటులు ఎవరూ పుట్టలేదన్నారు.. మేం రాజకీయాల్లోకి వచ్చేటప్పటికీ ఇప్పుడు ఉన్న వారికి ఏబీసీబీలు కూడా రావు అంటూ సెటైర్లు వేశారు. వారు సినిమాల్లో హీరో కావొచ్చు.. నేను రాజకీయాల్లో హీరో అని వ్యాఖ్యానించారు. రాజకీయాల్లో మొలతాడు లేని వాడు.. లాగు లేని వాడు.. కూఏడా నాకు పాఠాలు చెప్తున్నారని ఫైర్ అయ్యారు. మీది ఏంటి పొడుగు… ఎందుకు మీ దగ్గరకి రావాలి అని నిలదీశారు.
Read Also: Steven Smith-IPL 2024: ఐపీఎల్ 2024లోకి ‘అన్‌సోల్డ్’ స్టీవ్ స్మిత్.. అంబటి రాయుడు కూడా!
ఇక, నేను రాజకీయాల్లోకి రావడానికి కాపులు కారణం కాదు అన్నారు ముద్రగడ.. నా దగ్గరకు వస్తానని చెప్పి ఇనప ముక్క నీటిలో నాన పెట్టారంటూ మండిపడ్డారు. రాజకీయాలు మా దగ్గర నేర్చుకోవాలని సూచించారు.. నా మీద రక రకాలు తప్పుడు పోస్టింగ్ లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ఏ ఉద్యమాలు చేసిన బీసీలు, దళితులు ముందు ఉన్నారు.. మీరు చెప్పినట్లు నేను ఎందుకు రాజకీయాలు చేయాలి? అని ప్రశ్నించారు.. మరోవైపు.. పార్టీ ఆదేశిస్తే పోటీ చేస్తాను అని ప్రకటించారు.. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో పవన్ కల్యాణ్ ఎక్కడ పడుకున్నారు? అని నిలదీశారు. నాకు చెప్పడానికి ఆయన ఎవరు? ఉద్యమం జరిగినప్పుడు ఆయన ఎప్పుడైనా వచ్చారా? పవన్ కల్యాణ్‌కి నాకు సంబంధం ఏంటి? నిన్న కాక మొన్న పుట్టి.. నన్ను ప్రశ్నించడం ఏంటి? అంటూ ఓ రేంజ్‌లో విరుచుకుపడ్డారు ముద్రగడ పద్మనాభం.