Mudragada Vs Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై మరోసారి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. పవన్ కల్యాణ్ మగాడు అయితే డైరెక్ట్ గా నా మీద మాట్లాడాలని సవాల్ చేశారు.. ఇక, పవన్ కల్యాణ్ హైదరాబాద్‌లో పుట్టాడు.. ఆ రాష్ట్రం (తెలంగాణ) వేరు.. మన రాష్ట్రం (ఆంధ్రప్రదేశ్) వేరన్న ఆయన.. హైదరాబాద్ నుంచి వచ్చి పిఠాపురంలో ఎమ్మెల్యే కావాలని అనుకోవడం ఎంతవరకు సబబు? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో అవమానం జరిగినప్పుడు ఈ పౌరుషం, కోపం, పట్టుదల.. పవన్ కల్యాణ్‌కి ఏమయ్యాయి? అని నిలదీశారు.. అవమానం చేసిన వారి ఇంటికి వెళ్లి టిఫిన్ చేస్తారా? అని ప్రశ్నించారు.. ఇక, పవన్ కల్యాణ్ రెచ్చిపోతున్నాడు.. రెచ్చిపోయి మాట్లాడుతున్నాడు అంటూ ఫైర్ అయ్యారు ముద్రగడ పద్మనాభం.
Read Also: Aa Okkati Adakku: ‘ఆ ఒక్కటి అడక్కు’ థియేట్రికల్ హక్కులను సొంతం చేసుకున్న ఏషియన్ సురేష్!
ఇక, ఇక సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తిపై నోటికి వచ్చినట్టు మాట్లాడడం సబబు కాదని పవన్ కల్యాణ్‌కు సూచించారు ముద్రగడ.. నేను ఏమైనా మాట్లాడితే.. సినిమాల్లో ఉండే సైడ్ క్యారెక్టర్లతో తిట్టిస్తారని మండిపడ్డారు.. తెరచాటుగా నాపై మాట్లాడడం కాదు.. ప్రెస్‌మీట్ పెట్టండి.. నాపై సూటిగా మాట్లాడండి.. ప్రశ్నలు వేయండి.. నేను సమాధానం చెబుతా.. మళ్లీ నేను ప్రశ్నలు వేస్తా.. దానికి మీరు కూడా సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు ముద్రగడ పద్మనాభం.. మరోవైపు.. ఎన్నికల్లో కోట్లు, లక్షలు ఖర్చు చేస్తారని చెబుతున్నారు.. ప్రజలు అంతా అమ్ముడు పోతారనే కోణంలో మాట్లాడుతున్నారని మండిపడ్డారు. మీడియా సమావేశంలో ఇంకా ముద్రగడ పద్మనాభం ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియో లింక్‌ను క్లిక్ చేయండి..