NTV Telugu Site icon

Pawan Kalyan: ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతా

Pawan

Pawan

నేను కులాలను కలిపేవాడిని, పార్టీలను కలిపేవాడిని, కుటుంబాలను వేరు చేస్తానా? అని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. కాకినాడలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంను, ఆయన కుమార్తె క్రాంతిని కలుపుతాను తప్పా వేరు చేయనని స్పష్టం చేశారు. పెద్దలు పది మాటలు అంటారు.. నన్ను మీ నాన్నగారి దగ్గరికి తీసుకుని వెళ్ళండి.. ఆయనకు చెప్పి నేను తీసుకువస్తానని పద్మనాభం కుమార్తె క్రాంతితో పవన్ అన్నారు. తండ్రిని కూతురిని వేరు చేసే వ్యక్తిని కానన్నారు. తండ్రి బాధను, కూతురు బాధ్యతను అర్థం చేసుకోగలనని తెలిపారు. ముద్రగడ వైసీపీకి వెళ్లిన నాకు ఇబ్బంది లేదు గౌరవిస్తానని పేర్కొన్నారు.

READ MORE: Prajwal Revanna: ప్రజ్వల్ రేవణ్ణకు ‘బ్లూ కార్నర్’ నోటీస్ జారీ.. ఈ నోటీసులు అంటే ఏమిటి..?

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వస్తుందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు. తాండవ నది ద్వారా ఇసుక దోచుకున్నారని.. తాండవ నదికి రిటర్నింగ్ వాల్ నిర్మించలేకపోయారన్నారు. ఎవరు హ్యాచరీస్ పెట్టుకోవాలన్నా అధికారులు లంచాలు అడుగుతున్నారని ఆరోపించారు. కుటమీ ప్రభుత్వ రాగానే హ్యాచరీస్ స్వేచ్ఛలో ఇస్తామన్నారు. తుని అంటే రైలు దుర్ఘటన కాదని..తుని అంటే ఒక దేవాలయాలతో కూడిన నిలయమన్నారు. వాణిజ్య వ్యాపారాలకు సువిశాలంగా ఉండే ప్రాంతంగా గుర్తించాలని తాను 2018లో తుని వచ్చినట్లు తెలిపారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం కూడా సుమారు 25 సంవత్సరాల నుంచి ఉందని పేర్కొన్నారు. త్వరలోనే మోడీ గారితో మాట్లాడి ఏబీసీడీ వర్గీకరణ తీసుకొస్తామని హామీ ఇచ్చారు. దాడిశెట్టి రాజాకు ఓటు వేస్తే మీ ఆస్తులు గాల్లో పెట్టినట్టే అని విమర్శించారు. టీచర్లకి ఉద్యోగ భద్రత కల్పిస్తామని భరోసా ఇచ్చారు.