NTV Telugu Site icon

IPL 2023 : ఐపీఎల్ లో ఈ రికార్డులు ఎంఎస్ ధోనికే సొంతం..

Ms Dhoni

Ms Dhoni

మరో 48 గంటల్లో అహ్మదాబాద్ వేదికగా జరగబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్-16వ సీజన్ కు సర్వం సిద్దమైంది. ఈ సీజన్ భారత క్రికెట్ దిగ్గజం, సీఎస్కే కెప్టెన్ ఎంఎస్ ధోనికి చివరి సీజన్ అంటూ గత కొన్ని రోజులుగా వార్తులు వస్తున్నాయి. అయితే భారత్ కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన ధోని.. ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ ను నాలుగు సార్లు టైటిల్ విజేత నిలిపాడు. ఐపీఎల్ లో ధోని లెక్కకు మించి రికార్డులు ఉన్నాయి.

Also Read : Sabitha Indra Reddy : విద్యార్థులందరూ కూడా పరీక్షకు ప్రశాంతమైన వాతావరణంలో హాజరకండి

చెన్నై సూపర్ కింగ్స్ కు ఉన్న కోచింగ్ సిబ్బందితో ఆడి, వారికి కెప్టెన్ గా వ్యవహరించి ఆ తర్వాత కూడా వాళ్లతో ఆడుతున్న ఒకే ఒక్క ఆటగాడు ఎంఎస్ ధోనీ. ప్రస్తుతం చెన్నై కోచింగ్ స్టాప్ స్టీఫెన్ ఫ్లెమింగ్, మైఖెల్ హస్సీ, లక్ష్మీపతి బాలాజీలు ఒకప్పుడు ధోనీ సారథ్యంలో ఆడినవారే. ధోని అంటేనే ఫినిషర్. ఆరో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చే ధోని.. ఇన్సింగ్స్ చివర్లో వచ్చి దుమ్ము రేపుతాడు. అలా చివర్లో వచ్చి 20వ ఓవర్లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ ధోని. ఇప్పటి వరకు 20వ ఓవర్ లో వచ్చి ధోని 564 పరుగులు చేశాడు. ఈ రికార్డును ఇప్పటి వరకు ఏ బ్యాటర్ కూడా చేయలేదు.

Also Read : Bhadrachalam Sriramanavami Live: భద్రాద్రిలో శ్రీసీతారాముల ఎదుర్కోలు ఉత్సవం

కెప్టెన్ గా వంద మ్యాచ్ లను గెలిచిన సారథి మహేంద్ర సింగ్ ధోని మాత్రమే. ఐపీఎల్ లో ధోని సారథిగా ఏకంగా 104 మ్యాచ్ లు గెలిచాడు. ధోని మొత్తంగా ఐపీఎల్ లో 234( ఇందులో సీఎస్కేకు 196) మ్యాచ్ లు ఆడాడు. 206 ఇన్సింగ్స్ లలో 4,978 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో ధోనీ సగటు 39.20గా ఉండగా స్రైక్ రేట్ 135.20గా ఉంది. ఐపీఎల్ లో ఎక్కువగా ఐదు లేదా ఆరు స్థానాల్లో బ్యాటింగ్ కు వచ్చిన ధోని.. తాను ఆడిన ప్రతీ పొజిషన్ లో హాఫ్ సెంచరీ సాధించాడు. ఇలా సాధించిన ఒకే ఒక్క ఆటగాడు ధోని మాత్రమే..

Also Read : Asia Cup : అలా అయితే మేం ఇండియాకు రాం..

ఐపీఎల్ ఫైనల్స్ లో అత్యధిక సార్లు ఆడిన ఆటగాడు, కెప్టెన్ గా ధోని అరుదైన రికార్డును అందుకున్నాడు. ఇప్పటి వరకూ ధోనీ 10 ఫైనల్స్ ఆడాడు. ఇందులో నాలుగు సార్లు ట్రోఫీ కూడా గెలిచాడు. వికెట్ కీపర్ గా ధోని ఘనతలు అందుకోవడం రాబోయే తరాలకు కూడా సాథ్యం కాదు. ఐపీఎల్ లో ధోని.. 190 మ్యాచ్ లకు వికెట్ కీపర్ గా ఉండి 132 డిస్మిసల్స్ లో పాలు పంచుకున్నారు. 39 స్టపింగ్స్ కూడా చేశాడు. ఇది కూడా ఓ రికార్డే..

Show comments