Site icon NTV Telugu

Team India Coach: టీమిండియా కోచ్‌ పదవి.. అతడిని ఒప్పించేందుకు ఎంఎస్ ధోనీ ప్రయత్నాలు!

Ms Dhoni Csk

Ms Dhoni Csk

MS Dhoni to convince Stephen Fleming for the post of Team India Coach: టీమిండియా హెడ్ కోచ్‌ పదవి కోసం బీసీసీఐ ఇప్పటికే దరఖాస్తులను ఆహ్వానించింది. కొత్త కోచ్‌ భారత జట్టుకు 2027 వన్డే ప్రపంచకప్‌ వరకు ఉంటాడు. కోచ్‌ పదవి కోసం దరఖాస్తు చేసుకొనేందుకు మే 27 ఆఖరి గడువు. ఈ క్రమంలోనే హెడ్ కోచ్‌ పదవిని ఎవరితో భర్తీ చేస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుత కోచ్ రాహుల్ ద్రవిడ్ పదవి పొడిగింపుపై సముఖంగా లేడు. కోచ్‌ పదవి రేసులో చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్, ఆస్ట్రేలియా మాజీ కోచ్ జస్టిన్‌ లాంగర్, ఢిల్లీ కోచ్ రికీ పాంటింగ్‌తో పాటు కోల్‌కతా మెంటార్ గౌతమ్ గంభీర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి.

విదేశీ కోచ్‌ను తీసుకొనేందుకు బీసీసీఐ మొగ్గు చూపిస్తుందని క్రికెట్ వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే న్యూజిలాండ్‌ మాజీ కెప్టెన్, చెన్నై కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్‌తో బీసీసీఐ చర్చలు కూడా జరిపినట్లు వార్తలు వస్తున్నాయి. భారత్‌లోని పరిస్థితులు, ఆటగాళ్లను అర్థం చేసుకోవడంలో ఫ్లెమింగ్‌ అందికంటే ముందుంటాడని చాలా మంది అంటున్నారు. ఫ్లెమింగ్‌ను ఒప్పించేందుకు ఎంఎస్ ధోనీ సాయంను బీసీసీఐ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్లెమింగ్‌ను ఒప్పించాలని మహీని బీసీసీఐ సంప్రదించినట్లు సమాచారం. ఫ్లెమింగ్‌ను ఒప్పించేందుకు ధోనీ ప్రయత్నాలు చేస్తున్నాడట.

Also Read: Allu Arjun: పాన్ ఇండియా స్టార్ అయ్యుండి.. సింపుల్‌గా దాబాలో భోజనం! పిక్ వైరల్

కొత్తగా కోచింగ్‌ బాధ్యతలు చేపట్టే వ్యక్తి సంవత్సరంలో కనీసం పది నెలల పాటు భారత జట్టుతోనే ఉండాల్సి ఉంటుంది. అంతేకాదు ఐపీఎల్ ఫ్రాంచైజీకి రాజీనామా చేయాల్సి ఉంటుంది. ఇది స్టీఫెన్ ఫ్లెమింగ్‌కు ఇష్టమో లేదో తెలియదు. ఇంతకు అతడు కోచ్ పోస్టుకు దరఖాస్తు చేసుకున్నాడా? లేదా? అన్నది కూడా ఇంకా తెలియలేదు. ఎంఎస్ ధోనీ సంప్రదింపులు నిజమా అన్నది కూడా తెలియాల్సి ఉంది. ఐపీఎల్ ఆరంభం 2008 నుంచి చెన్నై ఫ్రాంచైజీతో ఫ్లెమింగ్‌కు మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే. మొదట్లో ఆటగాడిగా కొనసాగిన అతడు ఆపై కోచ్ అయ్యాడు. చెన్నై సీఈవో కాశీ విశ్వనాథ్ మాత్రం ఫ్లెమింగ్‌తో కోచ్ గురించి చర్చే జరగలేదని స్పష్టం చేశారు. ‘కోచ్‌ పదవి గురించి నేనేమీ ఇలాంటి వ్యాఖ్యలు వినలేదు. స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌ నుంచి కూడా మాకు దానిపై సమాచారం లేదు’ అని అన్నారు. ఏదైనా మరో కొన్ని రోజల్లో స్పష్టత రానుంది.

Exit mobile version