MS DHONI : ఆ మిస్టెక్ వల్లే గెలవాల్సిన మ్యాచ్ లో ఓడిపోయాం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బ్యాటింగ్ వైఫల్యంతోనే గెలవాల్సిన మ్యాచ్ లో ఓటమిపాలయ్యామని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అన్నాడు. ఐపీఎల్ 2023 సీజన్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ తో బుధవారం జరిగిన మ్యాచ్ లో చెన్నై 3 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ అనంతరం తమ ఓటమిపై స్పందించిన ధోని.. మిడిల్ ఓవర్లలో స్ట్రైక్ రేట్ రొటేట్ చేయడంలో తమ బ్యాటర్లు విఫలమయ్యారని.. ఆ తప్పిదమే తమ ఓటమిని శాసించిందని ధోని చెప్పుకొచ్చాడు.
Read Also : Deputy CM Narayana Swamy: దళితుడిననే కదా ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు.. డిప్యూటీ సీఎం ఆవేదన..
Also Read
- IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
- Chandrababu, Pawan Kalyan Meet: స్థానిక ఎన్నికలపై దృష్టిపెట్టిన చంద్రబాబు, పవన్.. నేడు కూటమి నేతల కీలక భేటీ..
- పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
- YS Jagan: స్థానిక సంస్థల ఎన్నికలపై జగన్ ఫోకస్.. ఇన్చార్జ్లతో వన్ టు వన్ భేటీలు
మిడిల్ ఓవర్లలో బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయాల్సింది. రాజస్థాన్ రాయల్స్ జట్టులో స్పిన్ బౌలర్లు ఎక్కువగా లేకున్నా.. అనుభవం కలిగిన స్పిన్నర్లు ఉన్నాు. దాంతో మా బ్యాటర్లు స్ట్రైక్ రొటేట్ చేయడంలో తడబట్టారు. ఈ లక్ష్యం చేధించడం పెద్ద కష్టమేమి కాదు.. లక్ష్యానికి సమీపంగా రావడం సంతోషంగా ఉంది. ఎందుకంటే టోర్నీ చివరి దశలో రన్ రేట్ కీలకం అవుతోంది. అందుకే రన్ రేట్ దెబ్బ తినకుండా ఉండాలని దగ్గరగా తీసుకొచ్చాం.. ఫీల్డ్ సెటప్ చూస్తూ బౌలర్ ప్రయత్నాలను పసిగడుతూ.. క్రీజులో నిలబడాలి.. బౌలర్ తప్పు చేసేలా ఆడాలి.. నేను దాని కోసమే ఎదురు చూశాను.. నా ప్లాన్ వర్కౌట్ అయింది. మనం మన బలాలను నమ్ముకొని ఆడాలి.. నా బలం స్ట్రైట్ గా హిట్ చేయడం డ్యూ కూడా ఉండటంతో బ్యాటర్లకు ఈజీగా మారింది. మా బౌలర్ల ప్రదర్శన పట్ల నేను సంతోషంగా ఉన్నాను అని ఎంఎస్ ధోని అన్నాడు. ఇది కెప్టెన్ గా నాకు 200 మ్యాచ్ అనే విషయం తెలియదు.. మైలురాళ్లను నేను పెద్దగా పట్టించుకోను.. వాటికంటే ఎలా ఆడుతున్నామనేదాన్ని పరిగణలోకి తీసుకుంటాం అని ధోనీ చెప్పుకొచ్చాడు.
Read Also : Real Dates vs Jujube: ఖర్జూరం అనుకుని చైనీస్ జుజుబీ తింటున్నారా?
ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లో 8 వికెట్లకు 175 పరుగులు చేసింది. బట్లర్ ( 52), హాఫ్ సెంచరీతో రాణించగా.. దేవదత్ పడిక్కల్ ( 38), అశ్విన్ ( 30), హెట్మేయర్ ( 30) విలువైన పరుగులు చేశారు. చెన్నై బౌలర్లలో ఆకాశ్, తుషార్ దేశ్ పాండే, రవీంద్ర జడేజా తల రెండు వికెట్లు తీసుకున్నారు. మొయిన్ ఆలీ ఒక వికెట్ పడగొట్టాడు. అనంతరం లక్ష్య చేధనకు దిగిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లో 6 వికెట్లకు 172 పరుగులు చేసి ఓటమిపాలైంది. డేవాన్ కాన్వే ( 50) హాఫ్ సెంచరీ చేయగా.. రహానే ( 38), ధోని (32) నాటౌట్ విలువైన పరుగులతో రాణించారు. రాజస్థాన్ రాయల్స్ బౌలర్లలో అశ్విన్, చాహల్ రెండేసి వికెట్లు తీయగా.. సందీప్ శర్మ, జాసన్ హోల్డర్ తలో వికెట్ తీశారు.

- Tags
- CSK
- IPL2023
- ms dhoni
- RR
- strike rotation
తాజావార్తలు
-
Release Postpones : పెద్ద సినిమాల రిలీజ్ అంటే నమ్మకం లేకుండా పోయిందా?
-
Delhi ACP Vivek Bhagat: మహిళా జర్నలిస్టు ఫిర్యాదు ఎఫెక్ట్.. ACP వివేక్ భగత్ అదనపు DCP బాధ్యతలు నిలిపివేత
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
‘Dada’ : ‘దాదా’ ఈజ్ బ్యాక్.. మైసూర్ షూటింగ్లో అడుగుపెడుతున్న నటసింహం
-
Mecca Defence Pact: హౌతీ దాడులతో సౌదీలో టెన్షన్.. బలగాలు పంపేందుకు పాకిస్థాన్, టర్కీ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి