MS Dhoni: నాకు వయసు అయిపోయింది అనిపిస్తోంది!
- నాకు వయసు అయిపోయింది అనిపిస్తోంది
- వచ్చే జులై 7కి 44వ పడిలోకి ఎంఎస్ ధోనీ
- నా కంటే ఆండ్రీ సిద్ధార్థ్ సరిగ్గా 25 ఏళ్లు చిన్నవాడు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
యువ ఆటగాళ్లను చూస్తుంటే తనకు వయసు అయిపోయింది అని అనిపిస్తోందని చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఎంఎస్ ధోనీ తెలిపాడు. ఇటీవల వైభవ్ సూర్యవంశీ తన కాళ్లకు నమస్కారం చేసినప్పుడు కూడా ఇలానే అనిపించిందన్నాడు. ఆండ్రీ సిద్ధార్థ్ తన కంటే సరిగ్గా 25 ఏళ్లు చిన్నవాడని తెలిసిందని, దీంతో తాను చాలా పెద్దవాడిని అయిపోయాననిపిస్తోందని ధోనీ చెప్పుకొచ్చాడు. 1981లో జన్మించిన మహీ వయసు ప్రస్తుతం 43 ఏళ్లు. వచ్చే జులై 7కి 44వ పడిలోకి అడుగెడతాడు. ఐపీఎల్ 2025లో భాగంగా గుజరాత్‌తో మ్యాచ్ అనంతరం ధోనీ మాట్లాడుతూ పలు విషయాలు పంచుకున్నాడు.
‘చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోని యువ ఆటగాళ్లను చూస్తుంటే నాకు వయసు అయిపోయింది అనిపిస్తోంది. రాజస్థాన్ మ్యాచ్ సందర్భంగా వైభవ్ సూర్యవంశీ నా కాళ్లకు నమస్కారం చేసినప్పుడు ఇలానే అనిపించింది. ఇటీవల నేను డగౌట్‌లోని కూర్చొని ఉండగా.. చెన్నై ఆటగాడు ఆండ్రీ సిద్ధార్థ్ వచ్చి నా పక్కన కూర్చున్నాడు. నీ వయసెంత అని అడిగా. నా కంటే అతడు సరిగ్గా 25 ఏళ్లు చిన్నవాడు. దీంతో నేను చాలా పెద్ద వాడిని అయిపోయా అని అనిపిస్తోంది’ అని ఎంఎస్ ధోనీ చెప్పాడు.
Also Read
- US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
- Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
- LV Prasad Hospital: అమరావతిలో ఎల్.వి.ప్రసాద్ కంటి ఆసుపత్రి.. 12 ఎకరాల స్థలంలో నిర్మాణం..
ఐపీఎల్లో కొనసాగలా? వద్దా అనే విషయంపై 4-5 నెలల్లో నిర్ణయం తీసుకుంటానని ఎంఎస్ ధోనీ స్పష్టం చేశాడు. ‘విజయంతో ఈ సీజన్‌ను ముగించినందుకు ఆనందంగా ఉంది. గుజరాత్ మ్యాచ్‌లో అన్ని రంగాల్లో మంచి ప్రదర్శన చేశాం. ఐపీఎల్ రిటైర్మెంట్పై నిర్ణయించుకోవడానికి నాకింకా 4-5 నెలల సమయం ఉంది. ఇప్పుడే తొందరపడాల్సిన అవసరం లేదు. ఇది ప్రొఫెషనల్ క్రికెట్. ఆటలో కొనసాగాలంటే ఫిట్నెస్ ముఖ్యం. చాలా రోజులుగా ఇంటికి దూరంగా ఉన్నాను. ఇప్పుడు రాంచీకి వెళ్లి కుటుంబంతో గడుపుతాను. బైక్ రైడ్ ఆస్వాదిస్తా. ఐపీఎల్లో నా కెరీర్ ముగిసిందని చెప్పడం లేదు, తిరిగి ఆడతానని కూడా చెప్పడం లేదు. నాకు ఎంతో సమయం ఉంది. ఆలోచించి మంచి నిర్ణయం తీసుకుంటా’ అని మహీ తెలిపాడు.
తాజావార్తలు
-
Explainers: బాబోయ్.. ఇండియన్స్ వద్దు..!
-
US: విమానంలో మహిళ రచ్చరచ్చ.. నగ్నంగా తిరుగుతూ అసభ్య ప్రవర్తన
-
Ambati Rambabu: అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు.. పోలీసు నోటీసులపై అంబటి ఆగ్రహం..
-
CM Revanth Reddy : రేవంత్‌తో ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్ భేటీ.. గ్లోబల్ సమ్మిట్‌కు ఆహ్వానం
-
UPI Charges: యూపీఐ చెల్లింపులపై కేంద్రం కీలక నిర్ణయం.. అక్టోబర్ 15 నుంచి అమల్లోకి కొత్త నిబంధనలు..
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?