MS Dhoni: ధోనీ ఫ్యాన్స్ కౌంట్‌డౌన్ స్టార్ట్ చేశారు. మళ్లీ మాహీ బాయ్ ఎప్పుడు మైదానంలోకి దిగి బ్యాట్ పట్టుకుంటాడో అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ఫ్యాన్స్ ఎదురు చూపులకు తెరదించుతూ ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నిజానికి MS ధోని అభిమానులకు IPL ముఖ్యమైనది. ఎందుకంటే ధోని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టేది ఈ ఏడాదిలో జరిగే ఐపీఎల్‌లోనే కాబట్టి. దీంతో ఇప్పటి నుంచే మాహీ ఫ్యాన్స్ ఐపీఎల్ ప్రారంభం కోసం ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా ధోని తన స్వస్థలమైన రాంచీలో 2026 IPL సీజన్ కోసం సన్నాహాలు ప్రారంభించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
READ ALSO: Trump Iran Aattack: ఇరాన్‌పై ట్రంప్ దాడి చేయబోతున్నారా?
గత ఏడాది ధోని సీఎస్‌కే జట్టుకు కెప్టెన్‌గా ఉన్న సంగతి తెలిసిందే. చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు ధోని తదుపరి సీజన్‌కు కూడా తిరిగి జట్టులో వస్తాడని హామీ ఇచ్చారు. ఇప్పుడు ధోని స్వయంగా మైదానంలోకి దిగి ప్రాక్టిస్ చేస్తూ తాను తిరిగి వస్తున్నట్లు చెప్పకనే చెప్పాడు. జార్ఖండ్ క్రికెట్ అసోసియేషన్ (JSCA) ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో రాంచీ స్టేడియంలోని నెట్స్‌లో తీసిన వీడియోను పోస్ట్ చేసింది. ఈ వీడియోలో ధోని ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపిస్తుంది. ధోని తన ఫ్రాంచైజ్ CSK పసుపు రంగు ప్యాడ్‌లను ధరించి, ఆపై తన కొత్త బ్యాట్‌ను బయటికి తీశాడు. ధోనితో పాటు జార్ఖండ్ క్రికెట్‌కు చెందిన తన జూనియర్, భారత మాజీ సహచరుడు సౌరభ్ తివారీ కూడా ఈ వీడియోలో ప్రాక్టీస్‌కు సిద్ధమవుతున్నట్లు కనిపించాడు. ఇప్పుడు JSCAలో సౌరభ్ తివారీ అధికారి కావడం గమనించదగ్గ విషయం.
ధోనీకి ఇదే చివరి సీజన్..?
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇదే ధోనికి చివరి IPL సీజన్ అవుతుందా లేదా అనేది, ఈ టోర్నమెంట్ ముగిసిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. IPL 19వ సీజన్ విషయానికొస్తే, ఇది మార్చి 26న ప్రారంభమై మే 31 వరకు కొనసాగుతుంది. అయితే కొత్త సీజన్ షెడ్యూల్ ఇంకా విడుదల కాలేదు.
READ ALSO: ICC T20 World Cup 2026 Schedule: స్కాట్లాండ్ ఎంట్రీతో మారిన టీ20 వరల్డ్ కప్ షెడ్యూల్..