MS Dhoni Captain: ఐపీఎల్ ఆల్-టైమ్ జట్టుకు కెప్టెన్‌గా ఎంఎస్ ధోనీ.. రోహిత్‌కు దక్కని చోటు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
IPL All-Time Greatest Team Captain is MS Dhoni: భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ ఆల్-టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టుకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. ఐపీఎల్ టోర్నీలో 5 టైటిల్స్ అందించిన ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మకు కనీసం జట్టులో కూడా చోటు దక్కకపోవడం విశేషం. 15 మందితో కూడిన ఆల్-టైమ్ గ్రేటెస్ట్ జట్టును ఐపీఎల్ సెలక్షన్ ప్యానెల్ ప్రకటించింది. 2008 నుంచి ఇప్పటిదాకా ఐపీఎల్ టోర్నీలో ఆడిన ఆటగాళ్లతో అత్యుత్తమ జట్టును ఆదివారం ప్యానెల్ ప్రకటించింది.
ఐపీఎల్ ఆల్-టైమ్ గ్రేటెస్ట్ జట్టు ఎంపిక సెలక్షన్ ప్యానెల్‌లో మాజీ ఆటగాళ్లైన వసీం అక్రమ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్‌లతో పాటు 70 మంది జర్నలిస్టులు కూడా ఉన్నారు. 2024 ఫిబ్రవరి 20 నాటికి ఐపీఎల్ 16 ఏళ్లు పూర్తి చేసుకోనుంది. ఈ నేపథ్యంలో ఆల్-టైమ్ గ్రేటెస్ట్ ఐపీఎల్ జట్టును ప్రకటించారు. ఈ జట్టులో కొన్ని ఆశ్చర్యకరమైన ఎంపికలు ఉన్నాయి. డేవిడ్ వార్నర్‌తో పాటు ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ ఎంపికయ్యాడు. క్రిస్ గేల్ మూడో స్థానంలో, సురేశ్ రైనా 4వ స్థానంకు ఎంపికయ్యాడు. ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, ఎంఎస్ ధోనీలతో బ్యాటింగ్ లైనప్ ఉంది.
Also Read
- Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
- Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
15 మందితో కూడిన జట్టులో హార్దిక్ పాండ్యా, కీరన్ పొలార్డ్, రవీంద్ర జడేజాలు ఆల్‌రౌండర్‌లుగా ఎంపికయ్యారు. రషీద్ ఖాన్, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్ స్పిన్ కోటాలో.. లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రాలు పేస్ కోటాలో జట్టులో చోటు దక్కించుకున్నారు. ఎంఎస్ ధోనీ కెప్టెన్, కీపర్‌గా ఎంపికయ్యాడు. స్టార్ స్పోర్ట్స్ ఇన్‌క్రెడిబుల్ 16 ఆఫ్ ఐపీఎల్’ షోలో వసీం అక్రమ్, మాథ్యూ హేడెన్, టామ్ మూడీ, డేల్ స్టెయిన్‌లు మాట్లాడుతూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
ఐపీఎల్ ఆల్-టైమ్ టీమ్:
ఎంఎస్ ధోనీ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్, డేవిడ్ వార్నర్, సురేష్ రైనా, ఏబీ డివిలియర్స్, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కీరన్ పొలార్డ్, రషీద్ ఖాన్, సునీల్ నరైన్, యుజ్వేంద్ర చహల్, లసిత్ మలింగ, జస్ప్రీత్ బుమ్రా.
తాజావార్తలు
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
-
Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
-
Sonam Wangchuk: 24 గంటల్లో సీజేపీ నేతల్ని విడుదల చేయాలి, లేదంటే.. సోనమ్ వాంగ్‌చుక్ అల్టిమేటం.!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!