Robin Uthappa: మరికొన్ని రోజుల్లో ఐపీఎల్ 2026 ప్రారంభం కానుంది. ఈ సీజన్ ప్రారంభానికి ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. ఈ సందర్భంగా సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త వెలుగులోకి వచ్చింది. ఈ సీజన్‌తో ధోని ఐపీఎల్‌కు సైతం గుడ్‌బై చెబుతాడని వార్తలు చెక్కర్లు కొడుతున్న నేపథ్యంలో టీమిండియా మాజీ ప్లేయర్ రాబిన్ ఉతప్ప ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ధోనికి ఇది చివరి ఐపీఎల్ కావచ్చని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఈ చివరి సీజన్‌లో కేవలం ప్లేయర్‌గానే కాకుండా ‘మెంటర్-కమ్-ప్లేయర్’ వ్యవహరిస్తారని తెలిపాడు. మరోవైపు.. రాజస్థాన్ రాయల్స్ మాజీ కెప్టె్న్ సంజూ శామ్సన్ సీఎస్‌కేలోకి రావడం చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. అంశంపై ఉతప్ప మాట్లాడాడు.. “ధోని ఈసారి తన పాత్రను మరింత తగ్గించుకుంటారని నేను భావిస్తున్నాను. ఏడో స్థానంలో కాకుండా, ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే అవకాశం ఉంది. తన వీడ్కోలు దగ్గర పడిందని ధోనికి తెలుసు, అందుకే తన నీడ నుంచి బయటపడి కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ తన సొంత ముద్ర వేసేలా సహకరిస్తారు” అని పేర్కొన్నారు.
READ MORE: Punganur Tragedy: ఒక చిన్న నిర్లక్ష్యం.. నాలుగు ప్రాణాలు బలి!
ఇదిలా ఉండగా.. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2026 సీజన్ తొలి దశ షెడ్యూల్ ఇప్పటికే రిలీజ్ అయింది. దేశంలోని మూడు రాష్ట్రాల్లో (పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం) అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తొలి 20 మ్యాచ్‌ల షెడ్యూల్‌ను మాత్రమే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) బుధవారం ప్రకటించింది. మూడు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల తేదీలు ప్రకటించిన తర్వాత.. ఐపీఎల్ 2026 పూర్తి షెడ్యూల్‌ను బీసీసీఐ వెల్లడించనుంది. ఇక 19వ ఎడిషన్ తొలి దశ మార్చి 28న ఆరంభమై.. ఏప్రిల్ 12 వరకు కొనసాగనుంది. ఐపీఎల్ 2026 టోర్నీ ప్రారంభ మ్యాచ్ చిన్నస్వామి స్టేడియంలో డిఫెండింగ్ ఛాంపియన్స్ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ), సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) మధ్య జరుగనుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.
