NTV Telugu Site icon

MS Dhoni Instagram: నలుగురిని మాత్రమే ఫాలో అవుతున్న ఎంఎస్ ధోనీ.. అందులో ‘సూపర్ స్టార్’ ఒకరు!

Ms Dhoni Instagram

Ms Dhoni Instagram

MS Dhoni Follows Amitabh Bachchan in Instagram: క్రికెట్‌లో అత్యంత క్రేజ్ ఉన్న ప్లేయర్‌లలో ఎంఎస్ ధోనీ ఒకరు. భారత జట్టుకు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించడమే కాకుండా.. కెప్టెన్ కూల్‌గా నీరాజనాలు అందుకున్నారు. అభిమానులు ధోనీని ‘తలా’ అని ముద్దుగా పిలుచుకుంటారు. మైదానంలో తన ఆట తీరుతో ప్రేక్షకులను అలరించిన మహీ.. సోషల్ మీడియాలో కూడా సత్తాచాటుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 49.3 మిలియన్లు, ఎక్స్‌లో 8.6 మిలియన్లు, ఫేస్‌బుక్‌లో 27 మిలియన్ల మంది ఫాలోవర్లను ధోనీ కలిగి ఉన్నారు.

సోషల్ మీడియాలో అత్యధికంగా అనుసరించే ప్రముఖులలో ఒకరిగా ఉన్న ఎంఎస్ ధోనీ.. అతడు మాత్రం నలుగురిని మాత్రమే ఫాలో అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో వ్యవసాయ వ్యవసాయ ఖాతా ఈజాఫార్మ్స్, సతీమణి సాక్షి, కుమార్తె జివా, బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌ను మాత్రమే ఫాలో అవుతున్నారు. తన సన్నిహితులు, భారత క్రికెట్ ఆటగాళ్లను కూడా మహీ ఫాలో కావడం లేదు. ఇక ఎక్స్‌లో మాత్రం 33 ప్రముఖ వ్యక్తులను అనుసరిస్తున్నారు.

Also Read: Panjagutta PVR: పీవీఆర్ సినిమా థియేటర్లో వర్షం.. ‘కల్కి’ షో నిలిపివేత!

ఐపీఎల్ 2024లో సిక్సులతో అలరించిన ఎంఎస్ ధోనీ.. తాజాగా అనంత్-రాధిక వెడ్డింగ్ ఈవెంట్‌లో మెరిశారు. కుటుంబంతో కలిసి అంబానీ ఇంట పెళ్లికి హాజరయ్యారు. మహీ కొత్త లుక్ అందరిని ఆకర్షించింది. మహీ డ్యాన్స్ చేసిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ధోనీ భారత్ తరఫున 90 టెస్టులు, 350 వన్డేలు, 98 టీ20లు ఆడారు.

Show comments