కోలీవుడ్ స్టార్ హీరో గా శింబు శ్వత్ మారిముత్తు దర్శకత్వంలో #STR51 తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ లవ్’ (God of Love) అనే ఆసక్తికరమైన టైటిల్‌ను పరిశీలిస్తున్నారట. పేరుకు తగ్గట్టే ఇది ఒక రొమాంటిక్ యాక్షన్ ఫాంటసీ మూవీ అని తెలుస్తోంది. గతేడాది ‘డ్రాగన్’ సినిమాతో మంచి హిట్ కొట్టిన అశ్వత్ మారిముత్తు, ఈసారి శింబు తో గట్టిగానే ప్లాన్ చేస్తున్నారు. ఏజీఎస్ ఎంటర్టైన్మెంట్ ఈ సినిమాను గ్రాండ్‌గా నిర్మిస్తోంది. అయితే తాజాగా
Also Read: Seetha Ramam Part 2: సీతారామం-2 షురూ.. సీక్వెల్‌పై అప్‌డేట్ వైరల్!
టాలీవుడ్‌లో ‘సీత’గా వెలిగిపోయిన మృణాల్ ఠాకూర్, ఎట్టకేలకు తమిళ ప్రేక్షకులను పలకరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట. ఇన్నాళ్లూ మంచి కథ కోసం వెయిట్ చేసిన ఈ బ్యూటీ, ఈ మూవీలో శింబు (STR) సరసన మృణాల్ హీరోయిన్‌గా ఫిక్స్ అయినట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి టైటిల్‌కి తగట్టుగానే ఈసారి శింబు-మృణాల్ జోడీతో బాక్సాఫీస్ వద్ద మేజిక్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు మెకర్స్.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ-ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్ నుంచి షూటింగ్ మొదలుపెట్టి, సాధ్యమైనంత త్వరగా అంటే 2026 లోనే ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు. అంతేకాదు, ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించే అవకాశం ఉండటంతో అంచనాలు అప్పుడే పెరిగిపోయాయి. త్వరలోనే మృణాల్ ఎంట్రీపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానుంది. ‘సీతారామం’ తర్వాత సౌత్‌లో మృణాల్ చేస్తున్న మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ ఇదే కావడంతో ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు.
