హాట్ బ్యూటీ మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.మృణాల్ ఠాకూర్ సీరియల్ నటిగా తన కెరీర్ ను ప్రారంభించారు. బుల్లితెర ద్వారా వచ్చిన ఫేమ్ తో మరాఠీ చిత్రం విట్టి దండు తో హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ కి పరిచయం అయ్యింది . మృణాల్ కి బాలీవుడ్ లో లవ్ సోనియా సినిమా మంచి బ్రేక్ ఇచ్చింది. ఆ తరువాత సూపర్ 30, బాట్లా హౌస్ వంటి చిత్రాల్లో నటించి పాపులర్ అయింది.ఈ భామ హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరో గా తెరకెక్కిన సీతారామం సినిమాతో తెలుగు ఇండస్ట్రీ కి పరిచయం అయింది. ఈ సినిమా గత ఏడాది విడుదలై బ్లాక్ బస్టర్ విజయం సాధించింది.సీతారామం సినిమా ఫీల్ గుడ్ మూవీగా ప్రేక్షకుల మదిలో ఎప్పటికి నిలిచిపోతుంది..ఈ సినిమాలో సీత పాత్రలో మృణాల్ అద్భుతంగా నటించింది. సీతారామం సినిమా విజయంతో ఈ భామకు తెలుగులో వరుస ఆఫర్స్ వస్తున్నాయి.
ఈ భామ నేచురల్ స్టార్ నానికి జంటగా హాయ్ నాన్న సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ మూవీ ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.. ఇటీవల ఈ సినిమా నుంచి టైటిల్ తో పాటు ఫస్ట్ గ్లింప్స్ ను విడుదల చేశారు. హాయ్ నాన్న సినిమా ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమా డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.ఈ భామ కు తెలుగులో మరొక ఆఫర్ కూడా వచ్చింది.విజయ్ దేవరకొండ హీరో గా దర్శకుడు పరుశురాం తెరకెక్కిస్తున్న సినిమాలో ఈ భామ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాతగా వ్యవహారిస్తున్నారు.. రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది.కాగా ఈ భామ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టీవ్ గా ఉంటుంది. నిత్యం తన తన హాట్ ఫోటోలు షేర్ చేస్తూ రచ్చ చేస్తుంది.తాజాగా స్లీవ్ లెస్ ఫ్రాక్ లో మృణాల్ ఠాకూర్ సూపర్ హాట్ గా కనిపించింది.ఆమె తన క్లీవేజ్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి