NTV Telugu Site icon

Mrunal Thakur : నేను అలా చేయడం అమ్మనాన్నకు అస్సలు ఇష్టం లేదు

Mrunal Thakur

Mrunal Thakur

Mrunal Thakur : సీతారామం సినిమాతో ఓ రేంజ్లో స్టార్ డమ్ అందుకున్న హీరోయిన్ మృణాల్ ఠాకుర్. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడీ దర్శకత్వంలో వచ్చిన సీతారామం సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో అమ్మడికి ఇండస్ట్రీలో మంచి పేరు వచ్చింది. ఈ సినిమా సక్సెస్ తో తెలుగులోనే కాకుండా పలు భాషల్లో అవకాశాలను సంపాదించుకుంటుంది. ఇకపోతే మృణాల్ సినీ కెరీర్ ప్రారంభంలో అంత సాఫీగా సాగలేదు. ఇండస్ట్రీలోకి రావడానికి ముందు మృణాల్ కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. తాను నటన రంగం వైపునకు వెళ్తానన్నప్పుడు తన తల్లిదండ్రులు ఒప్పుకోలేదని ఓ సందర్భంలో మృణాల్ చెప్పుకొచ్చింది.

Read Also: Pathaan Bikini Row: పఠాన్ బికినీ వివాదం.. ఎట్టకేలకు నోరు విప్పిన డైరెక్టర్

మృణాల్ తన కెరీర్ గురించి మాట్లాడుతూ.. తాను సినిమాల్లోకి రావడం తల్లిదండ్రులకు ఇష్టం లేదని చెప్పింది. వాళ్లది మరాఠి ఫ్యామిలీ అని.. అమ్మానాన్నకు సినిమా ఇండస్ట్రీ గురించి ఏ మాత్రం తెలియదంది. అందుకే సినిమాల్లోకి వస్తానంటే వారు చాలా భయపడిపోయారని చెప్పింది. సీరియల్స్ లో నటిస్తూ అక్కడ గుర్తింపు తెచ్చుకుని మూవీస్ లోకి ఎంట్రీ ఇచ్చినట్లు వివరించింది. తాను ఎంచుకున్న పాత్రలు సినిమాలే మంచి పేరు తీసుకొచ్చాయని మృణాల్ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం తనను చూసి పేరెంట్స్ గర్వపడుతున్నారంటే గర్వంగా చెప్పుకొచ్చింది.

Read Also: Celina Jaitly: వాళ్లు అడుక్కోరు.. తప్పుగా ప్రవర్తిస్తారు.. నెటిజన్‌కి సెలీనా గుణపాఠం

అయితే ప్రస్తుతం మృణాల్ తెలుగులో నాని 30 వ సినిమాలో నటిస్తోంది. నూతన దర్శకుడు శౌర్యువ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నాడు. మలయాళ సినిమా హృదయం లాంటి సూపర్ హిట్‌కు సంగీతాన్ని సమకూర్చిన హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. సాను జాన్ వర్గీస్ ఐఎస్‌సీ ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేయనున్నారు.

Show comments