Site icon NTV Telugu

Mrunal-Danush : “చెన్నై వాలా” అంటే ధనుషేనా? రిపోర్టర్ల ప్రశ్నలకు మృణాల్ ఠాకూర్ సిగ్గుల మొగ్గ!

Mrunal Danush

Mrunal Danush

మృణాల్ ఠాకూర్ – ధనుష్ రిలేషన్ లో ఉన్నట్లు గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక రేంజ్‌లో చర్చ జరుగుతోంది. అయితే తాజాగా తన బాలీవుడ్ ‘దో దివానే షెహర్ మే’ మూవీ ప్రమోషనల్ లో బాగంగా విలేకర్లతో ముచ్చటించగా.. మృణాల్‌కు రిపోర్టర్ల నుంచి ఊహించని ప్రశ్న ఎదురైంది. ఒక రిపోర్టర్ పరోక్షంగా ధనుష్‌ను ఉద్దేశిస్తూ “చెన్నై వాలా” గురించి అడగడంతో మృణాల్ ఒక్కసారిగా నవ్వేశారు. ఆమె పక్కనే ఉన్న నటుడు సిద్ధాంత్ చతుర్వేది కూడా ఆమెను ఆటపట్టిస్తూ నవ్వడంతో దీనికి సంబంధించిన వీడియో వైరల్ అవుతుంది.

Also Read : Mrunal Thakur : బన్నీ సినిమాలో మృణాల్ ఛాన్స్.. రూమర్లపై ‘సీత’ క్రేజీ రియాక్షన్!

నిజానికి ధనుష్ తన తదుపరి చిత్రం ‘D-55’ (రాజ్ కుమార్ పెరియసామి దర్శకత్వంలో) కోసం మృణాల్‌ను సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని రిపోర్టర్లు ప్రస్తావిస్తూ ఆమెను ఆటపట్టించారు. మృణాల్ దీనికి నేరుగా సమాధానం చెప్పకపోయినా, ఆమె ముఖంలోని చిరునవ్వు చూస్తుంటే ఈ కాంబినేషన్ దాదాపు ఖాయమేనని అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. “చెన్నై వాలా” అంటూ ధనుష్ ఫ్యాన్స్ కూడా ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. ధనుష్ ప్రజంట్ పాన్ ఇండియా రేంజ్‌లో సినిమాలు చేస్తుండటంతో, మృణాల్ వంటి టాలెంటెడ్ నటి ఆయన పక్కన ఉంటే స్క్రీన్ ప్రెజెన్స్ అదిరిపోతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. దీంతో ఈ ప్రాజెక్టుపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ ఎప్పుడు వస్తుందో అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 

Exit mobile version