NTV Telugu Site icon

Mrunal Thakur Pic: ‘దివ్య’గా మృణాల్ ఠాకూర్.. కొత్త ఫోటో వైరల్!

Mrunal Thakur Pic

Mrunal Thakur Pic

Mrunal Thakur Pic Goes Viral From Kalki 2898 AD: సైన్స్ అండ్ ఫిక్షన్‌ జోనర్ ప్రాజెక్ట్‌ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల విషయంలో టాక్ ఆఫ్‌ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. రిలీజ్ మొదటి రోజు నుంచే కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న కల్కి.. బాక్సాఫీస్‌ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు (గ్రాస్‌) వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కల్కి పార్ట్‌-2 కోసం ఇప్పటి నుంచేఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సక్సెస్ కారణంగా అతిథి పాత్రలో మెరిసిన నటీనటుల పోటోలను చిత్ర యూనిట్ వరుసగా రిలీజ్ చేస్తోంది.

కల్కిలో విజయ్‌ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించగా.. ఆయనకు సంబందించిన ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. తాజాగా మృణాల్ ఠాకూర్ పోస్టర్‌ను వదిలింది. ‘కల్కి 2898 ఏడీ ప్రపంచం నుంచి మృణాల్ ఠాకూర్‌ను దివ్యగా పరిచయం చేస్తున్నాం’ అని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పేర్కొంది. మృణాల్ కొత్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా మొదట్లోనే ఓ చిన్న క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించారు. ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్‌ను ఆమె చేశారు.

Also Read: Mahesh Babu: అనంత్, రాధిక పెళ్లికి ‘సూపర్ స్టార్’.. హాలీవుడ్ హీరోలా మహేష్ బాబు!

కల్కి సినిమా గురించి మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ‘సినిమా విజువల్స్‌ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. కాస్ట్, మ్యూజిక్​, వీఎఫ్‌ఎక్స్‌, కాస్ట్యూమ్స్‌.. ఇలా ప్రతీ చక్కగా కుదిరాయి. ఈ మాస్టర్​పీస్‌ను అందించిన నాగ్‌ అశ్విన్‌కు ధన్యవాదాలు. ప్రభాస్, అమితాబ్‌ బచ్చన్, కమల్​హాసన్‌ యాక్టింగ్ సూపర్. పార్ట్‌ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూన్ 27 రిలీజ్ అయిన విషయం తెలిసిందే.