Mrunal Thakur Pic: ‘దివ్య’గా మృణాల్ ఠాకూర్.. కొత్త ఫోటో వైరల్!
- టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా కల్కి
- బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు
- దివ్యగా మృణాల్ ఠాకూర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mrunal Thakur Pic Goes Viral From Kalki 2898 AD: సైన్స్ అండ్ ఫిక్షన్ జోనర్ ప్రాజెక్ట్ ‘కల్కి 2898 ఏడీ’ కలెక్షన్ల విషయంలో టాక్ ఆఫ్ ది గ్లోబల్ ఇండస్ట్రీగా నిలిచింది. రిలీజ్ మొదటి రోజు నుంచే కాసుల వర్షాన్ని కురిపిస్తోన్న కల్కి.. బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది. ప్రపంచవ్యాప్తంగా రూ.1000 కోట్లు (గ్రాస్) వసూలు చేసిన భారతీయ చిత్రంగా రికార్డు సృష్టించింది. కల్కి పార్ట్-2 కోసం ఇప్పటి నుంచేఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కల్కి సక్సెస్ కారణంగా అతిథి పాత్రలో మెరిసిన నటీనటుల పోటోలను చిత్ర యూనిట్ వరుసగా రిలీజ్ చేస్తోంది.
కల్కిలో విజయ్ దేవరకొండ అర్జునుడి పాత్రలో కనిపించగా.. ఆయనకు సంబందించిన ఓ పోస్టర్‌ను చిత్ర యూనిట్ ఇటీవల రిలీజ్ చేసింది. తాజాగా మృణాల్ ఠాకూర్ పోస్టర్‌ను వదిలింది. ‘కల్కి 2898 ఏడీ ప్రపంచం నుంచి మృణాల్ ఠాకూర్‌ను దివ్యగా పరిచయం చేస్తున్నాం’ అని ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ పేర్కొంది. మృణాల్ కొత్త ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. సినిమా మొదట్లోనే ఓ చిన్న క్యారెక్టర్‌లో మృణాల్ ఠాకూర్ కనిపించారు. ప్రెగ్నెంట్ లేడీ క్యారెక్టర్‌ను ఆమె చేశారు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
Also Read: Mahesh Babu: అనంత్, రాధిక పెళ్లికి ‘సూపర్ స్టార్’.. హాలీవుడ్ హీరోలా మహేష్ బాబు!
కల్కి సినిమా గురించి మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఓ స్పెషల్ పోస్ట్ షేర్ చేసిన విషయం తెలిసిందే. ‘సినిమా విజువల్స్ మైండ్ బ్లోయింగ్‌గా ఉన్నాయి. కాస్ట్, మ్యూజిక్, వీఎఫ్‌ఎక్స్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతీ చక్కగా కుదిరాయి. ఈ మాస్టర్‌పీస్‌ను అందించిన నాగ్ అశ్విన్‌కు ధన్యవాదాలు. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్‌హాసన్ యాక్టింగ్ సూపర్. పార్ట్ 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని పేర్కొన్నారు. ప్రభాస్ కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ జూన్ 27 రిలీజ్ అయిన విషయం తెలిసిందే.
Here’s presenting our @mrunal0801 as 𝐃𝐈𝐕𝐘𝐀 from the world of #Kalki2898AD.#EpicBlockbusterKalki in cinemas – https://t.co/xbbZpkWzqs@SrBachchan @ikamalhaasan #Prabhas @deepikapadukone @nagashwin7 @DishPatani @Music_Santhosh @VyjayanthiFilms @Kalki2898AD @saregamaglobal… pic.twitter.com/wd76M8AvoJ
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 12, 2024
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!