ఎస్సీ వర్గీకరణకు అండగా నిలిచిన ఎన్డీఏ కూటమి గెలుపే ఎమ్మార్పీఎస్ లక్ష్యం అని ఎమ్మార్పీఎస్ నేతలు తెలిపారు. వింజమూరు మండల కేంద్రంలోని బొమ్మరాజు చెరువు సమీపంలో ఉన్న టీడీపీ కార్యాలయంలో ఎంఎస్పి సీనియర్ నాయకులు ఉదయగిరి బిట్ టూ ఇంఛార్జి గోచిపాతల వెంకటేశ్వర్లు మాదిగ ఆధ్వర్యంలో సోమవారం ఎమ్మార్పీఎస్ జిల్లా స్థాయి, నియోజకవర్గంలోని మండల నాయకులతో కలిసి ఎన్డీఏ కూటమి అభ్యర్థి కాకర్ల సురేష్ ను కలిసి శాలువాతో ఘనంగా సన్మానించారు.
అనంతరం ఎమ్మార్పీఎస్ నాయకులు మాట్లాడుతూ.. గ్రామ స్థాయిలో కాకర్ల గెలుపు కోసం నిరంతరం శ్రమిస్తామని, ఎన్డీఏ కూటమికే తమ మద్దతు అని తెలిపారు. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాలు మేరకు.. ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గెలిపించుకునేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తామన్నారు. ఈ సందర్భంగా ఎంఎస్పీ జాతీయ నాయకులు గొల్లపల్లి శ్రీనివాస్ మాదిగ, ఎంఎస్పీ జిల్లా అధ్యక్షులు పందిటి అంబేద్కర్ మాదిగ, ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షులు సూరిపాక ఉదయ్ కృష్ణ మాదిగ పాల్గొని మాట్లాడారు.
Off The Record : TDPని ఇప్పుడు పెన్షన్ టెన్షన్ వెంటాడుతోంది..?
ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్న ఎన్డీఏ కూటమికే ఎమ్మార్పీఎస్ మద్దతు ఉంటుందని.. అందుకు ఉదయగిరి నియోజకవర్గ అభ్యర్థి కాకర్ల సురేష్ ని గెలిపించుకునే భాద్యత ప్రతీ మాదిగ బిడ్డకు ఉందని…ఎస్సీ వర్గీకరణ విషయంలో తానున్నాను అని ముందుకు వచ్చిన ఎన్డీఏ కూటమి అధినేత చంద్రబాబు మాదిగలకు సంక్షేమ ఆర్థిక రాజకీయ రంగాలలో అండగా ఉంటానని.. ఇచ్చిన హామీ ఒక బలమైన సంకేతాన్ని ఇచ్చిందని అందుకు ఎన్డీఏ బలపరచిన అభ్యర్థి కాకర్ల సురేష్ గెలుపే మాదిగల గెలుపుగా మనం అడుగుల వేస్తామన్నారు. ఏదైతే గత ఐదేళ్ల పాలనలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ విషయంలో మాదిగలకు చేసిన మోసం అంతా ఇంతా కాదని గత నెల 30 తేదీన గుంటూరులో జరగవలసిన రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాన్ని అడ్డుకోవడం దుర్మార్గమైన చర్య అని తెలిపారు.
కూటమి గెలుపే లక్ష్యంగా పనిచేయాలని నియోజకవర్గంలోని ప్రతి మాదిగ బిడ్డ ఎస్సీ వర్గీకరణతో మన భవిష్యత్ మారబోతుంది.. కనుక పార్లమెంట్ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, అసెంబ్లీ అభ్యర్థి కాకర్ల సురేష్ ని గెలిపించి మన ఎస్సీ వర్గీకరణ సహకారానికి అడుగుల వేయించాలని వారు కోరారు. అదేవిధంగా ఏప్రిల్ 7వ తేదీన గుంటూరులో జరిగే రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశానికి నెల్లూరు జిల్లాలోని అన్ని నియోజకవర్గ మండలాల నుండి, ఉదయగిరి నియోజకవర్గం నుండి అత్యధిక సంఖ్యలో తరివచ్చేల చూడాలని ప్రతి ఎమ్మార్పీఎస్ నాయకులు కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
MI vs RR: ముంబైకి మూడో ఓటమి.. రాజస్థాన్ కు మూడో విజయం
ఈ కార్యక్రమంలో ఎంఎంఎస్ జిల్లా అధ్యక్షురాలు మంద సుజాత మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు వడ్లపల్లి కృష్ణయ్య మాదిగ, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు గోసాల సుధాకర్ మాదిగ, ఎంఎస్పీ సీనియర్ నాయకులు గొల్లపల్లి మోహన్ రావు మాదిగ, ఎం మాలకొండయ్య, కొండాపురం, కలిగిరి, వింజమూరు, దుత్తలూరు, జలదంకి, సీతారామపురం మండల ఇంఛార్జిలు, అధ్యక్షులు నందిపోగు వెంగళరావు మాదిగ, మల్లెల తిరుమలేశు, కొడవటిగంటి కిరణ్ మాదిగ, బొర్రా వెంగళరావు మాదిగ, గోచిపాతల ఆనంద్ మాదిగ, బర్రె అర్జున్, గొల్లపల్లి చిన పెంచలయ్య మాదిగ, గంగపట్ల నాగరాజు, కె. రత్తయ్య, జి. జ్ఙానకుమార్ తదితరులు పాల్గొన్నారు.