NTV Telugu Site icon

Monkeypox: మంకీపాక్స్‌కు కొత్త పేరు.. ఏమిటో తెలుసా?

Monkeypox

Monkeypox

Monkeypox: మంకీపాక్స్ వ్యాధికి ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) కొత్త పేరు పెట్టింది. అంతర్జాతీయ నిపుణులతో వరుసగా సంప్రదింపులు జరిపిన అనంతరం చివరకు ఈ పేరును ఖరారు చేసింది. ఇకపై మంకీపాక్స్‌ను ‘ఎంపాక్స్‌’ అని పిలవాలని ప్రపంచ దేశాలకు సిఫారసు చేసింది. మంకీపాక్స్‌ కొన్ని దశాబ్దాల నుంచి ఆఫ్రికాలో జనానికి సోకుతున్నప్పటికీ ఆ వ్యాధి పేరు విచక్షణారహితంగా, జాతి వివక్ష ధ్వనించేలా ఉందని ఫిర్యాదులు వచ్చాయి. దాంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఇక నుంచి మంకీ పాక్స్‌ వ్యాధిని ఎంపాక్స్‌ అని వ్యవహరించాలని సోమవారం ప్రకటించింది. మరో ఏడాది పాటు ఈ వ్యాధిని మంకీపాక్స్, ఎంపాక్స్ అని రెండు పేర్లతో పిలుస్తారు. ఆ తర్వాత పాత పేరును తొలగించి కొత్త పేరును వినియోగించారు.

Gujarat Elections: గుజరాత్‌ ఎన్నికలు.. 20 శాతం అభ్యర్థులు నేరచరితులే.. ఆప్‌దే అగ్రస్థానం

ఈ ఏడాది మొదట్లో మంకీపాక్స్ వ్యాప్తి మొదలైనప్పుడు దీనిపై కొందరు ఆన్‌లైన్‌లో జాత్యహంకార, అసభ్య పదజాలంతో దూషించారు. అంతేగాక ఈ పేరుపై కొన్ని దేశాలు, వ్యక్తులు అభ్యంతరం తెలిపి ఆందోళన వ్యక్తం చేశారు. పేరు మార్చాలని ప్రతిపాదించారు. దీంతో నిపుణులతో సంప్రదింపులు జరిపిన అనంతరం డబ్ల్యూహెచ్‌ఓ కొత్తపేరును ఖరారు చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ చాలా ఏళ్ల తరవాత ఒక వ్యాధి పేరును మార్చడం ఇదే మొదటిసారి కావడం గమనార్గం. ఈ వ్యాధికి ఆంగ్లంలో కొత్త పదమైన ఎంపాక్స్‌(mpox)ను అనుసరించాలని డబ్ల్యూహెచ్‌వో సిఫార్సు చేసింది. అసాధారణంగా ఉన్న వ్యాధులకు పేర్లు కేటాయించడం తమ బాధ్యత అని ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో ప్రకారం.. మంకీపాక్స్ వైరస్ స్థానికంగా ఉన్న పశ్చిమ లేదా మధ్య ఆఫ్రికా కంటే యూరప్, ఉత్తర అమెరికాలోని దేశాల్లో ఈ కేసులు నమోదయ్యాయని తెలిసింది.