NTV Telugu Site icon

Woman Jumps into Well: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో బావిలో దూకిన భార్య.. కానీ..

Suicide

Suicide

Woman Jumps into Well: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్‌పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకేసింది. ముందుగా తన పిల్లలను బావిలో తోసేసి ఆ తర్వాత తానూ దూకేసింది ఆ తల్లి. కానీ, అందులో దూకిన తర్వాత ఆమెకు మళ్లీ ప్రాణాలపై ఆశ పుట్టింది. ఎలాగైనా బతకాలని నిర్ణయించుకుంది. బావిలోకి లోతుగా వేలాడుతున్న ఓ తాడును అందుకుంది. పెద్ద బిడ్డను పట్టుకుని ఆమె బయటకు వచ్చేసింది. ఈ ఇద్దరు బయటకు వచ్చారు. కానీ, ముగ్గురు పిల్లలు ఆ బావిలోనే ప్రాణాలు కోల్పోయారు.

ఆ భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన భార్య ప్రమిలా ఆత్మహత్య చేసుకోవాలనే క్షణికావేశానికి లోనైంది. అంతేకాదు, తన పిల్లలనూ వెంట తీసుకెళ్లాలని అనుకుంది. ఇంటికి సమీపంలోని బావి వద్దకు వారందరినీ తీసుకెళ్లింది. నీటిలో పడిపోవడంతో మహిళ ప్రాణ భయంతో తన పెద్ద కుమార్తెతో సురక్షితంగా పైకి ఎక్కేందుకు బావిలోకి వేలాడుతున్న తాడును పట్టుకుంది. ఆమె తన ముగ్గురు పిల్లలను విడిచిపెట్టింది, అందులో 18 నెలల కుమారుడు వరుసగా మూడు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుర్హాన్‌పూర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్ది గ్రామంలో ఈ ఘటన జరిగిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ కుమార్ తెలిపారు. ప్రమీలా భిలాలా అనే మహిళ తన భర్త రమేష్‌తో గొడవపడిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలిపారు.

Read Also: Dowry: చెల్లి మీద ఎంత ప్రేమ..పెళ్లికి రూ.8 కోట్ల కట్నం ఇచ్చిన రైతు సోదరులు

ప్రమీల ఇంటికి సమీపంలో ఉన్న బావిలో నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రమీల, ఆమె 7 ఏళ్ల కుమార్తె పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు.

Show comments