Woman Jumps into Well: భర్తతో గొడవ.. నలుగురు పిల్లలతో బావిలో దూకిన భార్య.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Woman Jumps into Well: మధ్యప్రదేశ్‌లోని బుర్హాన్పూర్ జిల్లాలో 30 ఏళ్ల మహిళ తన నలుగురు పిల్లలతో కలిసి బావిలోకి దూకేసింది. ముందుగా తన పిల్లలను బావిలో తోసేసి ఆ తర్వాత తానూ దూకేసింది ఆ తల్లి. కానీ, అందులో దూకిన తర్వాత ఆమెకు మళ్లీ ప్రాణాలపై ఆశ పుట్టింది. ఎలాగైనా బతకాలని నిర్ణయించుకుంది. బావిలోకి లోతుగా వేలాడుతున్న ఓ తాడును అందుకుంది. పెద్ద బిడ్డను పట్టుకుని ఆమె బయటకు వచ్చేసింది. ఈ ఇద్దరు బయటకు వచ్చారు. కానీ, ముగ్గురు పిల్లలు ఆ బావిలోనే ప్రాణాలు కోల్పోయారు.
ఆ భార్య భర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపం చెందిన భార్య ప్రమిలా ఆత్మహత్య చేసుకోవాలనే క్షణికావేశానికి లోనైంది. అంతేకాదు, తన పిల్లలనూ వెంట తీసుకెళ్లాలని అనుకుంది. ఇంటికి సమీపంలోని బావి వద్దకు వారందరినీ తీసుకెళ్లింది. నీటిలో పడిపోవడంతో మహిళ ప్రాణ భయంతో తన పెద్ద కుమార్తెతో సురక్షితంగా పైకి ఎక్కేందుకు బావిలోకి వేలాడుతున్న తాడును పట్టుకుంది. ఆమె తన ముగ్గురు పిల్లలను విడిచిపెట్టింది, అందులో 18 నెలల కుమారుడు వరుసగా మూడు, ఐదు సంవత్సరాల వయస్సు గల ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బుర్హాన్పూర్ జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న బల్ది గ్రామంలో ఈ ఘటన జరిగిందని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ రాహుల్ కుమార్ తెలిపారు. ప్రమీలా భిలాలా అనే మహిళ తన భర్త రమేష్‌తో గొడవపడిన తర్వాత ఈ దారుణానికి ఒడిగట్టిందని తెలిపారు.
Also Read
- Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
- Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి 'రాగి బన్ దోస' ఇంట్లోనే చేసేయండి ఇలా.!
- AP Weather Today: ఏపీకి వాతావరణ హెచ్చరిక.. ఆ రెండు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ!
- CM Revanth Reddy: భవిష్యత్ తరగతి గదుల్లోనే ఉంది.. విద్యతోనే సమాజ మార్పు సాధ్యం.!
Read Also: Dowry: చెల్లి మీద ఎంత ప్రేమ..పెళ్లికి రూ.8 కోట్ల కట్నం ఇచ్చిన రైతు సోదరులు
ప్రమీల ఇంటికి సమీపంలో ఉన్న బావిలో నుంచి ముగ్గురి మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం నిమిత్తం తరలించామని, కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు. ప్రమీల, ఆమె 7 ఏళ్ల కుమార్తె పరిస్థితి బాగానే ఉందని పోలీసులు తెలిపారు.
తాజావార్తలు
-
Electric Scooters: విశాలమైన బూట్ స్పేస్.. హెల్మెట్‌తో పాటు కిరాణా సామాను కూడా పట్టే టాప్ ఎలక్ట్రిక్ స్కూటర్లు ఇవే!
-
FIFA World Cup 2026 : టాప్ 7 హయ్యేస్ట్ పెయిడ్ ప్లేయర్స్… ఆటలో ఒక్కొక్కరి సంపాదన వందల కోట్లు
-
Gudivada Amarnath: హోంమంత్రి గారు ఆ రోజు మహిళా లోకం గుర్తుకు రాలేదా?.. ఎక్కడైనా ఫిర్యాదు చేసుకోండి!
-
Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
-
Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్‌రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ …
ట్రెండింగ్
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!
-
8560mAh భారీ బ్యాటరీ, 6000 నిట్స్ డిస్ప్లే, IP69K రక్షణతో HONOR X70 Pro Max లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా.!