Site icon NTV Telugu

Uttam Kumar Reddy : అక్టోబర్‌ 6 తరువాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్

Uttamkumar2

Uttamkumar2

సూర్యాపేట జిల్లాలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో పలు కుటుంబాలు చేరాయి.. వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఉత్తమ్.. ఈ సందర్భంగా. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. అక్టోబర్‌ 6 తరువాత ఏ క్షణంలోనైనా ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవుతుందని ఆయన వెల్లడించారు. రానున్న శాసన సభ ఎన్నికల్లో 70 సీట్లతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడుతుందని, తెలంగాణతో పాటు మిగతా నాలుగు రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంను ఏర్పాటు చేస్తుందన్నారు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి. రాహుల్ ప్రధాని అవడానికి ఈ 5 రాష్ట్రాల్లో ఎన్నికలే తొలిమెట్టు అని ఆయన అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు భాజపా ఎన్నికల కోసమే ప్రవేశ పెట్టిందని ఆయన వ్యాఖ్యానించారు. మహిళా బిల్లు సోనియా గాంధీ మానస పుత్రిక…మేం సంపూర్ణ మద్దతు ప్రకటించామని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వెల్లడించారు.

Also Read : Amazon Forest:100 డాల్ఫిన్‌ లు మృతి.. కారణం ఇదీ..

అంతేకాకుండా.. పైన పెద్ద మోడీ ఉంటే కేసీఆర్‌ చిన్న మోడీలా తయారయ్యాడని ఆయన విమర్శించారు. మేం నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు డబ్బా ఇళ్లు అని హేళన చేసిన కేసీఆర్‌…ఇంతవరకు ఒక్క ఇల్లు కూడా నిర్మించి ఇవ్వలేదన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదే అని ఆయన వ్యాఖ్యానించారు. ఒక్క ముదిరాజ్ సామాజిక వర్గానికి టికెట్ కేటాయించలేదని, ఒక్క మాదిగ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేకు మంత్రి పదవి లేదని ఆయన అన్నారు. హుజూర్ నగర్ కి చెందిన వైన్ షాప్ నిర్వాహకులు ఒక్కో షాప్ వద్ద నుంచి 6లక్షల రూపాయిల లంచం ఎమ్మెల్యే సైదిరెడ్డి వసూలు చేశారు…రైస్ మిల్లర్ల దగ్గర నుంచి కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నాడట.. పోలీసులు జాగ్రత్త ఎక్స్ట్రా లు చేయవద్దు… అక్రమ కేసులు పెడితే ఊరుకునే సమస్య లేదు. ఎన్నికల తరువాత వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామన్నారు ఉత్తమ్‌ కుమార్‌. సాగర్ ఎడమ కాలువ రైతులకు నీళ్ళు లేక పంటలు ఎండి పోతున్నాయని, 24 గంటల విద్యుత్తు విషయంలో ప్రభుత్వం అబద్ధాలు ఆడుతోందన్నారు.

Also Read : Jammu Kashmir: బోల్తా పడిన యాపిల్‌ లారీ.. తర్వాత ఏం జరిగిందంటే..!

Exit mobile version