Site icon NTV Telugu

Shocking incident: కడుపా.. బార్బర్ షాపా..!? డాక్టర్లే షాక్!

Keke

Keke

మధ్యప్రదేశ్ వైద్యులకు ఒక షాకింగ్ సంఘటన ఎదురైంది. ఎన్నడూ చూడలేని అరుదైన దృశ్యం ప్రత్యక్షం కావడంతో వైద్యులే నివ్వెరపోయారు. అసలేం జరిగింది. డాక్టర్లే షాకైన ఆ సంఘటన ఏంటో తెలియాలంటే ఈ వార్త చదవండి.

మధ్యప్రదేశ్‌లోని చిత్రకూట్‌లోని కుంద్ సద్గురు హాస్పిటల్ వైద్యులు ఓ మహిళకు శస్త్ర చికిత్స చేశారు. అయితే ఆమె కడుపులో ఉన్న తల వెంట్రుకల ముద్దను చూసి షాక్ అయ్యారు. దాదాపు 2.5 కిలోల జుట్టును బయటకు తీశారు. అయితే ఈ వ్యాధిని వైద్య పరిభాషలో ట్రైకోబెజోర్ అని పిలుస్తారని డాక్టర్ గెహానీ పేర్కొన్నారు. ఆమెకు రెండో సారి డెలివరీ అయ్యాక హెయిర్ తినడం ప్రారంభించింది. ట్రైకోబెజోర్ వ్యాధి ఉన్నవారు ఇలా చేస్తారని తెలిపారు. ఈ వ్యాధి ఒక శాతం మందిలో కనిపిస్తోందని డాక్టర్ చెప్పారు.

ఇది కూడా చదవండి: Gold smuggling: ప్రైవేట్ పార్ట్‌లో కేజీ బంగారాన్ని దాచిన ఎయిర్ హోస్టెస్

ఇటీవల బాధితురాలు తీవ్రమైన నొప్పితో బాధపడుతుండగా వైద్యుల్ని సంప్రదించింది. డాక్టర్లు స్కాన్ చేస్తే ఈ ఘటన బయటపడింది. ఆమె తన జుట్టుతో పాటు ఇతరుల వెంట్రుకలు కూడా తిన్నట్టుగా గుర్తించారు. సీనియర్ వైద్యురాలు డాక్టర్ నిర్మలా గెహానీ ఆమెకు ఆపరేషన్ చేసి కడుపులోంచి 2.5 కిలోల వెంట్రుకలను బయటకు తీశారు. మహిళ యూపీలోని మహోబా నివాసి అని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ముగ్గురు పిల్లలను కలిగి ఉన్న మహిళ తన మూడవ గర్భధారణ సమయంలో జుట్టు తినడం ప్రారంభించిందని డాక్టర్ గెహానీ చెప్పారు. CT స్కాన్ చేయమని సలహా ఇచ్చినప్పుడు ఆమె వ్యాధి బయటపడింది.

ఇది కూడా చదవండి: Nothing Phone 2a Special Edition: కలర్ ఫుల్ డిజైన్స్ తో నథింగ్ ఫోన్ 2ఎ స్పెషల్ ఎడిషన్ వచ్చేసిందోచ్..

Exit mobile version