Site icon NTV Telugu

MP Ranjith Reddy : కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది

Mp Ranjith Reddy

Mp Ranjith Reddy

కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంద‌ని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. చేవెళ్ల లోని కేజీఆర్ గార్డెన్ లో చేవెళ్ల, వికారాబాద్, పరిగి ఎమ్మెల్యేలు కాలె యాదయ్య, ఆనంద్, మహేశ్వర్ రెడ్డి లతో కలిసి విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ రంజిత్ రెడి మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం పై వివక్షత చూపుతుందని అన్నారు. పాలమూరు- రంగారెడ్డి తాగు, సాగునీటి ప్రాజెక్టు కు పర్యావరణ అనుమతులు ఇవ్వకుండా వ్యవరించిందని చెప్పారు. ఇప్పటికె ప్రాజెక్టు పనులు 85%పూర్తి అయ్యాయాని, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే చేవెళ్ల, వికారాబాద్, పరిగి,తాండూరు నియోజకవర్గ పరిధిలోని 12 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుందని వివరించారు. కాంగ్రెస్, బీజేపీ రెండు దొందేనని స్పష్టం చేశారు. ప్రాజెక్టు కు అనుమతులు, జాతీయ హోదా ఇచ్చేవరకు బీఆర్ఏస్ ప్రభుత్వం, పార్టీ ఎంపీలు పోరాటం చేస్తామని తెలిపారు. ఈ ఎన్నికల్లో బిజెపి, కాంగ్రెస్ లకు తగిన గుణపాఠం చెప్పాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

Also Read : Imran Khan: మా పార్టీని రద్దు చేస్తే చేయనీయండి. కొత్త పార్టీ పేరు మీద గెలుస్తాం..

ఇదిలా ఉంటే.. అంతకు ముందు.. మొయినాబాద్ మండలం, చిల్కూర్ గ్రామంలో చేవెళ్ల ఆరోగ్య రథ సేవలను స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్యతో కలిసి ఎంపీ రంజిత్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… ప్రస్తుతమున్న బిజీ లైఫ్ లో ప్రజలెవరూ కూడా ఆరోగ్యాన్ని అశ్రద్ద చెయ్యొద్దని, ఆరోగ్యం చాలా ముఖ్యమని అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో ఉన్న గడప గడపకు ఆరోగ్యాన్ని అందించే ఉద్దేశ్యంతో ఆరోగ్య చేవెళ్ల రథాన్ని ప్రారంభించామని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం వేల కోట్లు ఖర్చు చేస్తున్నదని గుర్తు చేశారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ద చెయ్యొద్దని, నిత్యం పరీక్షలు చేయించు కోవాలన్నారు. ఆరోగ్య తెలంగాణ కోసం సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావు కృషి చేస్తున్నారని వివరించారు.

Also Read : West Bengal: బెంగాల్లో దెబ్బతిన్న పాఠశాలలు.. కారణమదే!

Exit mobile version