ఏపీలో పాలనపై మండిపడ్డారు టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహననాయుడు. నిన్న కుప్పంలో జరిగిన సంఘటన ప్రజాస్వామ్యానికే చీకటి రోజు. అసలు రాష్ట్రం భారతదేశంలో ఒక భాగమా కాదా అనే సందేహం కలుగుతుంది.ఒక శాసన సభ్యుడు గా చంద్రబాబు కుప్పంలో తిరగడానికి ఎవరు పర్మిషన్ కావాలని అడుగుతున్నాను. ప్రతిపక్షం తిరగకుండా చేసేందుకే జగన్ చీకటి జీవోలను తీసుకొచ్చారు. దీనిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. చంద్రబాబును చూసి జగన్మోహన్ రెడ్డి ఎంత భయపడుతున్నాడో ఈ చీకటి జీవోలే నిదర్శనం.
గత సంవత్సర కాలం నుంచి ప్రజల వద్దకు చంద్రబాబు వచ్చి ధైర్యం చెబుతున్నారు. ఈ రాష్ట్రాన్ని మళ్లీ ముందుకు నడిపేందుకు సర్వశక్తులు దారపోస్తానంటూ ప్రజలకి ధైర్యం ఇస్తూ ముందుకు నడుస్తున్నారు. బాబు సభలకు వస్తున్న జన స్పందన చూసి ఓర్వలేక చంద్రబాబుని తిరగకుండా కుట్ర చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి తప్పులను బాబు ఎత్తి చూపుతున్నారు.ఎప్పుడైతే ప్రజావేదిక కూల్చారో అప్పుడే రాష్ట్రాన్ని కూల్చటం మొదలు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read ALso: Veera Simha Reddy Pre Release Event Live: ప్రీ రిలీజ్ ఈవెంట్ కు లైన్ క్లియర్
కొంతమంది పోలీసులు వైసీపీ కార్యకర్తలులా పనిచేస్తున్నారు. ఒక పార్టీకి పోలీసులు కొమ్ము కాయడం బహుశా ఏ రాష్ట్రంలో ఉండదు. బరితెగించి పోలీసులు వ్యవహరిస్తున్నారు.ఒక మాజీ సీఎం, ప్రతిపక్ష నాయకుడు ఎక్కడికి వెళ్లినా పోలీసులు సహకరించి సరైన బందోబస్తు కల్పించాలి. పోలీసులు బాబు సభలకు సరైన భద్రత కల్పించి ఉంటే ఎలాంటి ఘటనలూ జరిగేవి కావు.చంద్రబాబును జనాలకు దూరం చేస్తే మళ్లీ గెలుస్తారని జగన్ భ్రమలో ఉన్నారు.ఆయన ఎన్ని చీకటి జీవోలు తెచ్చిన ప్రజాస్వామ్యాన్ని ఎంత ఖూనీ చేసినా టీడీపీని ఆపలేరు.
నిన్నటి ఘటనతో జగన్ పని అయిపోయింది.వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో 1 ప్రజాస్వామ్య వ్యతిరేకమైన జీవో. ప్రతిపక్షాలకు ప్రజల దగ్గరకు వెళ్లేందుకు అన్ని రకాలుగా రాజ్యాంగం హక్కు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ లోప్రజాస్వామ్యం లేదు రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందని విమర్శించారు ఎంపీ రామ్మోహన నాయుడు.
Read ALso: Chandrababu Naidu: మంత్రి పెద్దిరెడ్డిపై చంద్రబాబు నిప్పులు