NTV Telugu Site icon

MP Raghunandan Rao : కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారు

Raghunandan

Raghunandan

అధికారంలోకి వచ్చి 7 నెలలు కావస్తున్నా హామీలు అమలు చేయడం లేదని బీజేపీ ఎంపీ రఘునందన్‌ రావు విమర్శించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్లు వేస్తూ కాలయాపన చేస్తున్నారని, వరంగల్ రైతు డిక్లరేషన్ లో ఇచ్చిన కాంగ్రెస్ హామీల అమలు ఏమైంది ? అని ఆయన ప్రశ్నించారు. డిసెంబర్ 9న రెండు లక్షల రుణ మాఫీ చేస్తామని చెప్పారు… కాంగ్రెస్ పార్టీకి వాళ్ళు ఇచ్చిన మ్యానిఫెస్టో మీద, సోనియా మీద, ఇందిరా గాంధీ మీద కూడా గౌరవం లేదని, అభయహస్తం పేరు తో మ్యానిఫెస్టోలో వరి ధాన్యానికి 2683 రూపాయల మద్దతు ధర ఇస్తామని చెప్పారు ఏమైంది ? అని ఎంపీ రఘునందన్‌ రావు అన్నారు. డిసెంబర్ 9న రుణమాఫీ ఎందుకు చేయలేదు ? అని, ఇందిరమ్మ రైతు భరోసా ఎక్కడ ? వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు.. ఏమైంది ? అని ఆయన అన్నారు. రుణ మాఫీ పద్రాగస్ట్ చేస్తామని భువనగిరిలో లక్ష్మి నరసింహ స్వామీ మీద, మెదక్ లో ఏడుపాయల దుర్గమ్మ మీద రేవంత్ రెడ్డి ఒట్లు వేశారని, ఎలా చేస్తారో చెప్పడం లేదన్నారు.

అంతేకాకుండా..’రైతుల కష్టాలను పట్టించుకోకుండా కాంగ్రెస్ పాలకులు టైం పాస్ చేస్తున్నారు. గుంపు మేస్త్రికి సరైన గైడెన్స్ ఇవ్వడం లేదు. రేవంత్ రెడ్డి అడుగులు తడబడుతున్నాయి. రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యేనాటికి BRS మరో 15 మంది ఎమ్మెల్యేలను కాపాడుకోలేని పరిస్థితి. మరో 15 నెలలు BRS పార్టీ ఉంటుందా ? అనేది అనుమానం. కేసీఆర్ ఫార్మ్ హౌస్ లో బెండ కాయలు, దొండకాయలు పండించుకుంటూ ప్రశాంతంగా గడపు. 5 రోజుల్లో ఢిల్లీలో ఉన్న రేవంత్ రెడ్డి.. రాజకీయాలు తప్ప అభివృద్ధి కోసం ఆలోచించడం లేదు. బీజేపీలో గుంపు మేస్త్రీలు లేరు… చదువుకున్న మేధావులు మంత్రులుగా ఉన్నారు. ఎకరాలలో సంబంధం లేకుండా ఎన్ని ఎకరాల్లో రైతు వ్యవసాయం చేస్తున్నాడో అన్ని ఎకరాలకు రైతు భరోసా ఇవ్వాలి. రియల్ ఎస్టేట్ భూములకి, వ్యవసాయేతర పనులకు ఉపయోగిస్తున్న భూములకు రాళ్ళు,రప్పలు ఉన్న భూములకు ఇవ్వొద్దు’ అని ఎంపీ రఘునందన్‌ రావు అన్నారు.