NTV Telugu Site icon

Raghunandan Rao: “బీఆర్ఎస్ పరిస్థితి టైటానిక్ షిప్ లా తయారైంది”..బీఆర్ఎస్ పై రఘునందన్ ఫైర్

Raghunandan Rao

Raghunandan Rao

మెదక్ పార్లమెంటు సీటు బీఆర్ఎస్ గెలుస్తుందని అన్ని సర్వేలు చెప్పాయని..మెదక్ పార్లమెంట్ లో ఆరడుగులు ఉన్నోడు, గద్ద ముక్కోడు, డబ్బులున్నోడు ఉన్నాడు కాబట్టి వాళ్లే గెలుస్తారని అనుకున్నారని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. మెదక్ లో తాను దెబ్బకొడితే బీఆర్ఎస్ అడ్రస్ లేకుండా పోయిందన్నారు. సంగారెడ్డిలో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల అభినందన సభకు ఆయన హాజరై మాట్లాడారు. టైటానిక్ షిప్ లా బీఆర్ఎస్ పరిస్థితి తయారయ్యిందని విమర్శించారు. నాలాంటి తెలంగాణ ఉద్యమకారులకు ద్రోహం చేస్తే ఏమవుతుందో కేసీఆర్ ఇప్పటికైనా తెలుసుకోవాలన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయినప్పుడే జనాలు సీఆర్ఎస్ ఇచ్చారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సంగారెడ్డి వరకు మెట్రో కావాలన్న జగ్గారెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఎందుకు అడగడం లేదని ప్రశ్నించారు. ఎంపీ అంటే సంగారెడ్డి వరకు మెట్రో పక్కా అనే నినాదంతో పని చేస్తానన్నారు. పార్టీలకతీతంగా నాకు ఓట్లేసి నాపై నమ్మకంతో గెలిపించారని కొనియాడారు. ఓడీఎఫ్, బీడీఎస్ పరిశ్రమ ఉద్యోగులకి వర్క్ అర్దర్లు పెంచుతామని హామీ ఇచ్చారు.

READ MORE: Health Tips: షుగర్ వ్యాధిగ్రస్తులు గుడ్లు తినొచ్చా.. తింటే ఏమౌతుంది?

మెదక్ లో బీజేపీ ఎలాగో గెలవదని మా నాయకులు పక్క నియోజకవర్గాలకి వెళ్లారని ఎంపీ రఘునందన్ రావు గుర్తుచేశారు. చీమల దండు కట్టి బలిసిన దొరల్ని ఓడించామన్నారు. జగ్గారెడ్డిపై ఎంపీ రఘునందన్ రావు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. ఆయన పుట్టింది బీజేపీలోనే పెరిగింది కూడా అందులోనే గెలిచింది బీజేపీలోనే అన్నారు.తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుడు ఆయన్నే చూసి నేర్చుకోవాలని మండిపడ్డారు. ఓటేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.