మాంసాహారం లేకపోయినా, కొంతమందికి భోజనంలో గుడ్లు ఉండేలా చూసుకుంటారు.
మాంసాహారులే కాకుండా కొందరు శాఖాహారులు కూడా గుడ్లు తింటారు.
గుడ్డులో శరీరానికి కావాల్సిన ప్రొటీన్లు, పోషకాలు పుష్కలంగా ఉంటాయి.
మరికొందరు గుడ్లలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటుందని భావించి, పచ్చసొనను పక్కన పెట్టి తెల్ల భాగాన్ని మాత్రమే తింటారు.
షుగర్ వ్యాధిగ్రస్తులు రోజూ గుడ్లు తినకూడదని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
రోజూ గుడ్లు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
ఈ వ్యాధిగ్రస్తులు వారానికి 3 లేదా అంతకంటే ఎక్కువ గుడ్లు తింటే రక్తంలో చక్కెర స్థాయిలు 39 శాతం పెరుగుతాయని ఓ అధ్యయనం వెల్లడించింది.
గుడ్లు తినడం వల్ల డయాబెటిస్ రిస్క్ 60 శాతం పెరుగుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి.
పురుషుల కంటే మహిళలకు ఎక్కువ ప్రమాదం ఉంది.