NTV Telugu Site icon

R.Krishnaiah : బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుంది

R. Krishnaiah

R. Krishnaiah

R.Krishnaiah : బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేయాలని చూస్తుందన్నారు ఎంపీ ఆర్‌ కృష్ణయ్య. బీజేపీ రాష్ట్ర కార్యాలయం ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని మోడీ బీసీ కాదని సీఎం రేవంత్ అంటున్నాడు.. కానీ ప్రధాని ఒరిజినల్ బీసీనే అని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ ప్రధాని అయిన తర్వాత భారత్ అభివృద్ధిలో పరిగెడుతుందని ఆయన వ్యాఖ్యానించారు. మోడీ హయాంలో భారత దేశం కీర్తి ఖండాంతరాలు దాటి వెళ్ళిందని ఆయన అన్నారు. సర్వేజనా సుఖినోభవంతు అనేది బీజేపీ మూల సిద్ధాంతమని, ప్రపంచంలోనే అగ్ర దేశంగా మన దేశాన్ని తీర్చి దిద్దుతున్నారన్నారు ఆర్‌ కృష్ణయ్య. బీజేపీ బీసీల పార్టీ అని, తెలంగాణలో రాబోయే రోజుల్లో బీజేపీదే గెలుపు అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించండని, తెలంగాణ పోరాటాల గడ్డ.. ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు ఆర్‌.కృష్ణయ్య.

 
Israel Hamas: “హమాస్ మిలిటెంట్‌కి ఇజ్రాయిలీ బందీ ముద్దు”.. తర్వాత కీలక విషయం వెల్లడి..
 

బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే బంగారు తెలంగాణకు పునాదులు అని, టీచర్లు, విద్యావంతులు, మేధావులు ప్రలోభాలకు లొంగకుండా ఉండాలన్నారు ఆర్‌.కృష్ణయ్య. అంతేకాకుండా.. 242 (d)6 చట్టం ప్రకారం స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్లు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వొచ్చని, కుల గణన లెక్కలు సరిగా లేవని ఆయన అన్నారు. ప్రస్తుతం రాష్ట్ర జనాభా 4 కోట్ల పైగా అన్నారని, కానీ రాష్ట్ర ప్రభుత్వం లెక్కల ప్రకారం జనాభా 3.55 కోట్లు ఉంది అదేల సాధ్యమవుతుందన్నారు ఆర్‌.కృష్ణయ్య. సర్వేలో 70 ప్రశ్నలు అడిగి ప్రజలను భయ బ్రాంతులకు గురి చేశారని, ప్రభుత్వం నిపుణుల అభిప్రాయం తీసుకొని సర్వే చేయాల్సి ఉండే అని ఆయన వ్యాఖ్యానించారు.

 Ram Mohan Naidu: ఎర్రన్నాయుడు బడుగు బలహీన వర్గాల నాయకుడు.. ఆయన ఆశయాలు కొనసాగిస్తాం