NTV Telugu Site icon

MP Mithun Reddy: 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.. దానిపై ప్రత్యేకంగా ఫోకస్ అవసరం లేదు..!

Mp Mithun Reddy

Mp Mithun Reddy

MP Mithun Reddy: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ పోటీ చేస్తుండడంతో.. వైఎస్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పిఠాపురం నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది.. ఇక, పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత, కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం.. పిఠాపురం సిట్టింగ్‌ ఎమ్మెల్యేతో ప్రత్యేకంగా సమావేశమైన వైసీపీ ఎంపీ, రీజనల్ కో ఆర్డినేటర్ మిథున్ రెడ్డి.. ఎన్నికల వ్యూహాలపై చర్చించినట్టుగా తెలుస్తోంది.. అయితే, ఎన్టీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన ఆయన.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి.. దానికోసం ప్రత్యేకంగా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదని కొట్టిపారేశారు. భీమవరం, గాజువాకలో ఓడిపోవడంతో పవన్ కల్యాణ్‌.. ఇక్కడ కొత్తగా ప్రచారం చేసుకుంటున్నాడన్న ఆయన.. పిఠాపురంలో మా అభ్యర్థి బలంగా ఉంది.. కొత్తగా మేం ప్రత్యేకంగా దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదన్నారు.

Read Also: Ganja Selling: వేములవాడలో గంజాయి కలకలం.. 5 గురు అరెస్ట్.. 10 మంది పరారీ..!

పవన్ కల్యాణ్‌ తన పార్టీలో మొదటినుంచి ఉన్న ఎంతమందికి న్యాయం చేశాడు? అని ప్రశ్నించారు ఎంపీ మిథున్‌రెడ్డి.. ఎంతమంది దగ్గర డబ్బులు తీసుకుని పవన్ టికెట్లు ఇచ్చాడు? అని నిలదీశారు. ఇక, మా సోషల్ ఇంజనీరింగ్ రాష్ట్రవ్యాప్తంగా ఉంది.. అధికారంలోకి వచ్చేది వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు.. మరోవైపు.. తనపై కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డిపై ఆరోపణలు గుప్పించారు మిథున్‌రెడ్డి.. కిరణ్ కుమార్ రెడ్డి పేరు గొప్ప ఊరుదిబ్బ అని ఎద్దేవా చేశారు.. తన ఆస్తులు కాపాడుకోవడానికి కిరణ్‌ కుమార్‌ రెడ్డి.. బీజేపీలోకి వెళ్లాడని ఆరోపించారు. నియోజకవర్గంలో ఎప్పుడైనా..? ఎవరికైనా..? సాయం చేశాడా? అంటూ కిరణ్‌ కుమార్‌ రెడ్డిని నిలదీశారు ఎంపీ మిథున్‌ రెడ్డి.