NTV Telugu Site icon

MP Margani Bharat: పవన్ కల్యాణ్‌ ఊసరవెల్లి.. ఢిల్లీలో యాక్టింగ్‌ చేస్తున్నాడు..

Mp Margani Bharat

Mp Margani Bharat

MP Margani Bharat: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్‌ అయ్యారు రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్‌.. పవన్ కల్యాణ్‌ ఢిల్లీలో సినిమా యాక్టింగ్ చేస్తున్నాడంటూ ఎద్దేవా చేసిన ఆయన.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై పాసిపోయిన లడ్డూలు ఇచ్చారంటూ భారతీయ జనతా పార్టీపై విమర్శలు గుప్పించిన పవన్.. ఇప్పుడు ఎన్డీఏలో ఎందుకు కలిశారో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీని తిట్టి 2019లో ఒంటరిగా పోటీ చేసి, 2024లో ఎందుకు ఏన్డీఏను కలుపుకొని వెళ్తున్నారో చెప్పాలని నిలదీశారు. పవన్‌ కల్యాణ్ తాజా కామెంట్లు, ఢిల్లీ పర్యటన, ఎన్డీఏ కూటమికి సమావేశానికి హాజరు కావడంపై ఎన్జీవీతో ప్రత్యేకంగా మాట్లాడిన రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ రామ్.. ఏపీకి ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ నిలిపివేత, వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు.. ఏమైన సాధించారా..? అంటూ ప్రశ్నలు సంధించారు. ఇక, పవన్ కల్యాణ్‌ ఊసరవెల్లి.. రోజుకొక మాట మాట్లాడతారని ఆరోపించారు. ఆంధ్రాలో భోజనం చేసి తెలంగాణలో నిద్రపోయే వ్యక్తులు పవన్ కల్యాణ్‌, చంద్రబాబు అంటూ విమర్శించారు. ఆంధ్రాలోనే ఉంటూ రాష్టాన్ని అభివృద్థి చేస్తున్న వ్యక్తి ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి అని ప్రజలు అర్థం చేసుకోవాలని అన్నారు ఎంపీ మార్గాని భరత్ రామ్.

Read Also: Uttarakhand: ఉత్తరాఖండ్లో పేలిన ట్రాన్స్‌ఫార్మర్‌.. 16 మంది మృతి

Show comments