టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్కామ్ లకే స్కామ్ ల రాజని రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్ అన్నారు. కేంద్ర సంస్థలు ఈడీ, ఐటీ సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రపంచమే నివ్వెరపోయే అవినీతి గుట్టలు అనేకం వెలుగు చూస్తాయని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ చీఫ్, రాజమండ్రి ఎంపీ భరత్ రామ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాజమండ్రిలో ఎంపీ భరత్ మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు అక్రమ సంపాదన రూ.118 కోట్ల విషయంపై ఐటీ శాఖ నోటీసులు ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు.
Read Also: Kalki2898AD: కల్కికి తప్పని లీకుల బెడద.. ప్రభాస్ లుక్ లీక్
ఈ మహా తిమింగలానికి ఈ 118 కోట్లు అల్పాహారం వంటిదని ఎంపీ మార్గాని భరత్ వ్యాఖ్యానించారు. నోటీసులు అందుకున్నా కనీసం చంద్రబాబు నోరు మెదపడం లేదని.. చట్టాల్లోని లొసుగులను ఆధారం చేసుకుని తప్పించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. హైకోర్టులో చంద్రబాబుపై 18 స్టేలు ఉన్నాయని, వాటిని తప్పించుకు తిరుగుతున్నారని అన్నారు. చంద్రయాన్-3ని చంద్రమండలం పైకి శాస్త్ర వేత్తలు ప్రయోగించి విజయం సాధించారే కానీ.. స్కామ్ ల బాబు స్కామ్ లను పట్టుకోవడం అధికార యంత్రాంగం వల్ల కావడం లేదని భరత్ ఆరోపించారు.
Read Also: Ustaad Bhagat Singh: పాపం ఉస్తాద్.. షూట్ మొదలెడదాం అనుకునేలోపే వరుణుడు ఆపేశాడు?
అవినీతి, అవకతవకలు చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని ఎంపీ మార్గాని భరత్ అన్నారు. చట్టాలకు వెరవడు.. అవినీతి, అక్రమాలే ఊపిరిగా చంద్రబాబు జీవితం సాగుతోందన్నారు. తూర్పు గోదావరి జిల్లాలో చంద్రబాబు పర్యటిస్తున్నాడని.. పేపర్లు, మీడియా ఐటీ నోటీసుల వ్యవహారంపై గొంతు చించుకుంటున్నా.. ఆయన మాత్రం నోరు మెదపడం లేదన్నారు. ఎంత వరకూ తప్పించుకున్నా.. ప్రజా క్షేతంలో ప్రజా కోర్టులో శిక్ష అనుభవించక తప్పదని ఎంపీ భరత్ హెచ్చరించారు. చంద్రబాబు అక్రమార్జనకు అమరావతి ఒక కన్నైతే, పోలవరం ఏటీఎం వంటిదని ఎంపీ అభివర్ణించారు.
Read Also: Mamata Banerjee: ఇండియా పేరు మార్చాల్సిన అవసరం ఏముంది..!
అమరావతి ఇన్సైడర్ ట్రేడింగ్ స్కామ్ లుగా పనిచేసిందని రాజమండ్రి ఎంపీ భరత్ ఆరోపించారు. సాక్షాత్తూ ప్రధాని మోడీయే చంద్రబాబుకు పోలవరం ఒక ఏటీఎంగా వాడుకున్నారంటే ఎంత బొక్కారో చెప్పకనే స్పష్టమవుతోందని ఆయన తెలిపారు. మానం, మర్యాద, సిగ్గూ, లజ్జ అన్నీ వదిలేసి నిస్సిగ్గుగా ప్రజల మధ్యకు వచ్చి కల్లబొల్లి మాటలు చెబుతున్న చంద్రబాబుకు ప్రజలే తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని ఎంపీ మార్గాని భరత్ అన్నారు.