MP: స్వాతంత్ర్య దినోత్సవం వేడుకలు ముగిశాయి. దేశ వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నాం. కానీ.. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఓ వ్యక్తికి మాత్రం ఏదో తక్కువైంది. ఏం తక్కువై ఉంటుంది? అని ఆలోచిస్తు్న్నారా? ఆయనకు లడ్డూ ఇవ్వలేదు. అదే పెద్ద లోటుగా మారింది. దీంతో కోపోద్రిక్తుడైన ఆ వ్యక్తం ఏకంగా సీఎంకు కంప్లైంట్ ఇచ్చాడు. దీంతో గ్రామ పంచాయతీ ఆశ్చర్యం వ్యక్తం చేసింది.
READ MORE: Schocking : టీవీ సీరియల్ గొడవ.. మహబూబాబాద్‌లో భార్య బిడ్డతో ఆత్మహత్యాయత్నం
మధ్యప్రదేశ్‌లోని భిండ్ జిల్లాకు చెందిన సీఎం హెల్ప్‌లైన్‌పై ఒక వింత ఫిర్యాదు వెలుగులోకి వచ్చింది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో రెండు లడ్డూలు అందకపోవడంతో కోపోద్రిక్తుడైన గ్రామస్థుడు సీఎం హెల్ప్‌లైన్‌కు ఫిర్యాదు చేశాడు. వాస్తవానికి.. ఆగస్టు 15న రౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంతంలోని నోధా గ్రామ పంచాయతీ కార్యాలయంలో జెండా ఎగురవేసే కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమం తర్వాత, పంచాయతీ తరఫున లడ్డూలను పంపిణీ చేశారు. కానీ జనాల సంఖ్య పెరిగింది. లడ్డూలు తగ్గాయి. దీంతో రెండు లడ్డూలకు బదులుగా ఒక లడ్డూను పంపిణీ చేయాలని నిర్ణయించారు.
READ MORE: Suryapet : బైక్ పై వెళ్తున్న ముగ్గురిని చంపేందుకు కారులో వెంబడించిన ఐదుగురు దుండగలు
అలాగే ఒక లడ్డూను గ్రామస్తుడు కమలేష్ బాబాకు కూడా ఇచ్చారు. కానీ కమలేష్ లడ్డూలు పంపిణీ చేసే వ్యక్తి నుంచి రెండు లడ్డూలు డిమాండ్ చేశాడు. తక్కువ లడ్డూలు ఉన్నాయని చెప్పి మరో లడ్డూ ఇవ్వడానికి నిరాకరించాడు. కమలేష్ కు ఇది నచ్చలేదు. ఈ అంశంపై కమలేష్ ముఖ్యమంత్రి హెల్ప్ లైన్ లో ఫిర్యాదు చేశాడు. సీఎం హెల్ప్ లైన్ నుంచి ఫిర్యాదు పంచాయతీ కార్యదర్శి రవీంద్ర శ్రీవాస్తవకు చేరింది. కమలేష్ కు మరో లడ్డూ ఇచ్చేందుకు కార్యదర్శి సిద్ధమయ్యాడు. కానీ.. ఈ ఫిర్యాదు కేవలం లడ్డూల గురించే కాదు, పంచాయతీలో జరుగుతున్న అక్రమాల గురించి కూడా అని ఫిర్యాదుదారుడు కమలేష్ బాబా చెబుతున్నారు. పంచాయతీలో గ్రామసభ జరిగినప్పుడల్లా ఎవరినీ ఆహ్వానించరని తెలిపాడు కమలేష్. పంచాయతీలో అవినీతి జరుగుతుందని, అందువల్ల దీనిపై సమగ్ర దర్యాప్తు జరపాలని డిమాండ్ చేస్తున్నాడు. ఆగస్టు 15న లడ్డూలు అంశంలోనూ అవినీతి జరిగిందంటున్నాడు.